కరోనా వైరస్ ప్రపంచంలో విలయతాండవం చేస్తోంది. 2020 ప్రపంచ దేశాలకు మర్చిపోలేని సంవత్సరంగా కరోనా వైరస్ ఆరు నెలలోనే అనేక చేదు జ్ఞాపకాలు మిగిల్చింది. చిన్న పిల్లవాడు మొదలుకొని ప్రధాని వరకు, పేదవాడు మొదలుకొని ధనవంతుడు వరకు అందరి జీవితాలలో అనేక మార్పులు తీసుకువచ్చింది. భవిష్యత్తుపై ప్లాన్లు వేసుకున్న వారి జీవితాలను కూడా అతలాకుతలం చేసింది కరోనా వైరస్. ప్రపంచంలో విలయతాండవం చేస్తున్న ఈ వైరస్ ని అంతమొందించడానికి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు అధ్యాపకులు రాత్రింబవళ్లు వ్యాక్సిన్ కనిపెట్టడం కోసం మందు కనిపెట్టడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

 

అయినా గానీ ఎక్కడా సరైన రిజల్ట్ రావడం లేదు. పేదవాని మొదలుకొని సెలబ్రిటీల వరకు ఎవరిని వదలటం లేదు కరోనా వైరస్. ఇదిలా ఉండగా భారత్ పక్క దేశం శత్రుదేశం పాకిస్థాన్ లో వైరస్ విలయతాండవం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. పాకిస్థాన్ దేశంలో రోజురోజుకీ కరోనా వైరస్ కొత్త పాజిటివ్ కేసులు ఊహించని విధంగా బయటపడటంతో పాటుగా అక్కడ వైద్య పరికరాలు కూడా సరిగ్గా లేకపోవటంతో వైరస్ వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉన్నట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు అందుతున్నాయి. ఇదిలా ఉండగా పాకిస్తాన్ దేశంలో కరోనా ఎఫెక్ట్ ఆ దేశ క్రికెట్ జట్టు మీద పడింది.

 

వస్తున్న వార్తలను బట్టి చూస్తే పాకిస్తాన్ టీం కి చెందిన ముగ్గురు ఆటగాళ్ల కి కరోనా సోకినట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. హైదర్ అలీ, హారిస్ రౌఫ్, షాదబ్ ఖాన్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని వెల్లడించింది. త్వరలోనే ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లనున్న నేపథ్యంలో తమ జట్టు ఆటగాళ్లకు రావల్పిండిలో కరోనా పరీక్షలు చేసింది పీసీబీ. ఈ పరీక్షల్లో ముగ్గురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక్కడ వింత ఏమిటంటే కరోన లక్షణాలు లేకుండా పాజిటివ్ రిపోర్ట్ రావటం. మరోపక్క మాజీ క్రికెటర్ ఆఫ్రిదీ కి కూడా కరోనా సోకటం జరిగింది. మొత్తంమీద పాకిస్థాన్ దేశంలో పరిస్థితి కరోనా వ్యాప్తి చేయి దాటి పోయినట్లే అని అందరూ అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: