పాకిస్తాన్ క్రికెట్ లో కరోనా వైరస్ కలకలం కొనసాగుతోంది. వారి ఆటగాళ్లకు ఇంటా బయట అసలు కలిసి రావడం లేదు. ప్రస్తుతం వారి ఆటగాళ్లను కరోనా మహమ్మారి వెంటాడుతోంది. వచ్చే నెలలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ తో మూడు టెస్టులు, మూడు టి20 లు ఆడేందుకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలోనే గత రెండు రోజుల క్రితం ముగ్గురు పాకిస్థాన్ క్రికెటర్లకు కరోనా సోకినా విషయం సంగతి అందరికీ విదితమే. అయితే ఒక్కసారిగా ఆ ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో ఆ దేశ క్రికెట్ బోర్డు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కి వెళ్ళిపోయింది.

 


సోమవారం నాడు జరిగిన టెస్టులో పాకిస్తాన్ క్రికెటర్ అయిన హ్యారిస్ రవూఫ్, హైదర్ అలీ, షాదాబ్ ఖాన్ క్రికెటర్లకు కరోనా పరీక్షలో పాజిటివ్ గా వచ్చింది. ఇక ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మీడియా పూర్వకంగా ధ్రువీకరించింది. వారందరికీ ఎలాంటి కరోనా లక్షణాలు లేవని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తెలియజేసింది. ప్రస్తుతం వారందరూ క్వారంటైన్ లో ఉన్నారని కూడా తెలిపింది. ఇక ఆ తర్వాత మిగతా క్రికెటర్ల కి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో ఏకంగా ఏడుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. 

 


ఇకపోతే తాజాగా ఫఖర్ జమాన్, ఇమ్రాన్ ఖాన్, కాశీఫ్ భట్టి, మహ్మద్ హఫీజ్, మహ్మద్ హస్నైన్, మహ్మద్ రిజ్వాన్, వహబ్ రియాజ్ ఆటగాళ్లు అందరికీ కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ జరిగింది. దీంతో వచ్చే నెలలో బయలుదేరాల్సిన పాకిస్తాన్ టీం అసలు ఆ సిరీస్ జరుగుతుందో లేదో అన్న అనుమానం ఇప్పుడు మొదలైంది. అయితే ఇప్పటివరకు ఇంగ్లాండ్ పనులపై ఎలాంటి స్పందన చేయని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: