కరోనా వైరస్  నేపథ్యంలో క్రీడా రంగం పూర్తిగా స్తంభించిన విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా కొన్ని క్రికెట్ జుట్టులు మళ్లీ క్రికెట్ ను మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే  అందుకోసం ఇరు జట్లు తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు సాగుతున్నాయి. అయితే ఇదే నేపథ్యంలో క్రికెట్ టోర్నీలో కొన్ని వాయిదా పడుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ న్యూజిలాండ్ పర్యటనను వాయిదా వేస్తున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిజాముద్దీన్ చౌదరి తెలియజేశారు.

IHG

 

 

ఈ సిరీస్ రద్దు చేసుకోవడానికి గల కారణం కరోనా వైరస్ వల్ల ఆటంకాలు, లేదా ఏవైనా ఇబ్బందులు ఎదురుకోవాల్సిన ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలియజేశారు. ఇకపోతే ఆగస్టు - సెప్టెంబర్ నెలలో రెండు టెస్టులను ఆడేందుకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇదివరకే షెడ్యూలు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

IHG

 

 

కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ సమయంలో పూర్తి స్థాయి క్రికెట్ సిరీస్ నిర్వహణ చాలా కష్టంతో కూడిన పని కాబట్టి అందులోనూ క్రీడాకారుల ఆరోగ్యం, రక్షణ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సిరీస్ ను రద్దు చేసుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు.

IHG

 


ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుతో చర్చించి వాయిదా వేసినట్లు ఆయన తెలియజేశారు. వాయిదా వల్ల ఇరు దేశాల క్రికెట్ అభిమానులు నిరుత్సాహ పడుతారని తెలిసిన తమ మాటను మన్నించి బంగ్లాదేశ్ న్యూజిలాండ్ సిరీస్ ను రద్దు చేసేందుకు ఒప్పుకున్న న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని నిజాముద్దీన్ చౌదరి తెలియజేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: