పాకిస్థాన్ క్రికెట్ జట్టును కరోనా వదలడం లేదు. ఇటీవల మాజీ ఆటగాళ్లు తౌఫిక్ ఉమర్ ,షాహిద్ ఆఫ్రిదిలు ఈవైరస్ బారిన పడగా అందులో తౌఫిక్ కోలుకోగా ఆఫ్రిది ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు. ఇక తాజాగా మరో 10మంది పాక్ ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇందులో మొన్న ముగ్గురు ఆటగాళ్లు.. హైదర్ అలీ ,షాదాబ్ ఖాన్ ,హారిస్ రవూఫ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా నిన్న మరో ఏడుగురు ఆటగాళ్లు.. కషిఫ్ బట్టి, హఫీజ్, మహమ్మద్ హస్నైన్ ,ఫకర్ జమాన్ ,రిజ్వాన్ , వాహబ్ రియాజ్, ఇమ్రాన్ ఖాన్ లకు కూడా పాజిటివ్ గా తేలింది అయితే వీరందరూ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే జట్టులో సభ్యులు.
 
ఈ పర్యటనకు ముందు ఆటగాళ్లందరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తుంది పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) అందులో భాగంగా ఏకంగా 10మంది వైరస్ బారిన పడడం తో ఇంగ్లాండ్ టూరు పై అనుమానాలు మొదలయ్యాయి అయితే టూరు షెడ్యూల్ ప్రకారమే ఉంటుందని పీసీబీ సీఈఓ వసీం ఖాన్ తెలియజేశాడు. లోకల్ మీడియాతో మాట్లాడిన వసీం..ఇంగ్లాండ్  పర్యటన షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది, టెస్టు జట్టుకు కావాల్సిన ఆటగాళ్లకు అందరికి కరోనా నెగిటివ్ వచ్చింది. వీరు 24న లాహోర్ లో కలుసుకొని 28న ఇంగ్లాండ్ కు బయలుదేరుతారు అనంతరం ఈసీబీ క్లియరెన్స్ ఇస్తే  ప్రాక్టీస్ మొదలుపెడతారని వసీం ఖాన్ స్పష్టం చేశాడు.
 
మొత్తం 29మంది ఆటగాళ్లను పీసీబీ ఈటూరు కోసం ఎంపిక చేసింది. ఇందులో ఇప్పడు 10మంది ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. ఇప్పటివరకు 16మంది ఆటగాళ్లకు నెగిటివ్ వచ్చింది. కాగా ఆగస్టు - సెప్టెంబర్ లో ఆతిథ్య జట్టు తో పాక్ ,మూడు టెస్టులు. మూడు టీ 20ల్లో తలపడాల్సి వుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: