అప్పటివరకు హాకీ నామస్మరణతో కొనసాగుతున్న భారత క్రీడారంగం ఒక్కసారిగా క్రికెట్ బాట పట్టిన రోజు అది. ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి విశ్వవిజేతగా నిలిచిన అపురూప క్షణాలు అవి. క్రికెట్ కు పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్ దేశంలో పేరుగాంచిన లార్డ్స్ మైదానంలో సగర్వంగా ప్రపంచకప్ ను ముద్దాడి నేటికి సరిగ్గా 37 సంవత్సరాలు. ఎందరో మహానుభావులు ఉన్న వెస్టిండీస్ వీరులను ఓడించింది దాదాపు నాలుగు దశాబ్దాలు అయిపోతున్న ఆ జ్ఞాపకాలు మాత్రం అభిమానులు ఇంకా అలాగే ఉన్నాయి. 

 


ఎలాంటి అంచనాలు లేకుండా ఇంగ్లాండ్ గడ్డపై కపిల్ దేవ్ సేన కేవలం 17 రోజుల్లో చరిత్రను తిరగరాసింది. ఏకంగా విశ్వవిజేతగా నిలిచింది. అయితే ఆ ప్రపంచ కప్ సాధించి నేటితో సరిగ్గా 37 సంవత్సరాలు అయ్యాయి. ఇక ఆ సమయంలో ప్రపంచ కప్ ఎంపిక చేయడానికి కొద్ది రోజుల ముందే అప్పటి భారత బ్యాట్స్మెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ కు వివాహం జరిగింది. అయితే ఆ తర్వాత సునీల్ గవాస్కర్ కృష్ణమాచారి కి ఫోన్ చేసి శ్రీకాంత్ మరో హనీమూన్ కు నువ్వు సిద్ధమవ్వు నువ్వు ప్రపంచ జట్టుకు ఎంపికయ్యావు అని తెలియజేశాడు. అప్పటికే రెండు సార్లు ప్రపంచ కప్ టోర్నీ గెలిచి ఊపు మీద ఉన్న వెస్టిండీస్ జట్టుతో భారత జట్టు తొలి మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. అయితే మ్యాచ్ మొదలయ్యే ముందు ఈ రోజు మనం వెస్టిండీస్ టీమ్ ను ఓడిస్తున్నామని కపిల్ దేవ్ అన్నాడట. అయితే జట్టులోని మిగతా సభ్యులందరూ అది జోక్ గా తీసుకొని నవ్వుకున్నారట. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ కపిల్ దేవ్ జట్టు రంగంలోకి దిగి విశ్వరూపం చూపించింది. అప్పటివరకు చిన్న జట్టుగా చూసిన టీమిండియాను వెస్టిండీస్ పై ఘన విజయం సాధించడంతో జట్టులో పూర్తి ఆత్మవిశ్వాసం పెరిగింది.

 


ఇక అదే ఊపులో తర్వాత మ్యాచ్ జింబాబ్వే ను ఓడించిన కపిల్ సేన ఆ తర్వాత రెండు మ్యాచ్ లలో ఆస్ట్రేలియా, వెస్ట్ఇండీస్ చేతిలో ఘోర విఫలం అయింది. ఇక ఆ సమయంలో ఇక చేసేదేమి లేక ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న తరుణంలో అద్భుత విజయం సాధించడం జరిగింది. ఇక ఆ మ్యాచ్లో కేవలం 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన భారత్ ఆతర్వాత కపిల్ దేవ్ ఒంటిచేత్తో 138 బంతుల్లో 175 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి ఒంటిచేత్తో గెలిపించాడు. ఇక ఆ తర్వాత చివరి లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి సెమీఫైనల్ కు భారత్ చేరుకుంది.

 

 


అయితే సెమీస్ లో టీం ఇండియా అద్భుతం చేసింది. హోమ్ టీం అయిన ఇంగ్లాండ్ జట్టును మట్టికరిపించి మొట్టమొదటిసారిగా ప్రపంచకప్ లో టీం ఇండియా ఫైనల్ కు చేరుకుంది. ఇంకేముంది ఫైనల్లో వెస్టిండీస్ తో మరోసారి పోరాడాల్సిన సమయం వచ్చింది. ఇక ఆ మ్యాచ్లో మొదట టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కపిల్ సేన వెస్టిండీస్ ముందు కేవలం స్వల్ప లక్ష్యాన్ని ఉంచిన కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో మొట్టమొదటిసారి టీమిండియా విశ్వ విజేత గా నిలిచింది. అయితే ఆ మ్యాచ్ లో విలియం రిచర్డ్స్ ఇచ్చిన క్యాచ్ ను కపిల్ దేవ్ 20 అడుగులు వెనక్కి పరిగెడుతూ పట్టిన క్యాచ్ ఇప్పటికి భారత క్రికెట్ అభిమానులు మర్చిపోరు. దీనితో వెస్టిండీస్ మ్యాచ్ ఓడిపోవడం ఖరారైందని చెప్పవచ్చు. ఆ తర్వాత ఆ మ్యాచ్ పై పట్టుబిగించిన భారత్ ఎలాంటి దశలోనూ వెస్ట్ఇండీస్ కు అవకాశం ఇవ్వకుండా ప్రపంచ కప్పును అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: