ఆర్చర్లు దీపికా కుమారి, అతాను దాస్‌ల పెళ్లికి ముఖ్య అతిథిగా టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్​ ధోనీ హాజరు కానున్నాడు. వీరితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు రానున్నారు. భారత ప్రముఖ విలువిద్య క్రీడాకారులు దీపికా కుమారి, అతాను దాస్​ల పెళ్లి పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఈనెల 30న జరగనున్న కార్యక్రమానికి పలువురు ప్రముఖలు హాజరు కానున్నారు. టీమ్​ఇండియా మాజీ సారథి ధోనీ కుటుంబసమేతంగా రానున్నాడు. స్వయంగా దీపికా, ఆమె తండ్రి పెళ్లి పత్రికను అందించి మహీని ఆహ్వానించారు.

 

ఝార్ఖండ్​ ముఖ్యమంత్రి హేమంత్​ సోరెన్​, గవర్నర్​ ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి అర్జున్​ ముండా, మాజీ ముఖ్యమంత్రి సుడేష్​ మెహతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్​ అధికారులందరినీ దీపికా ఆహ్వానించింది. కరోనా జాగ్రత్త చర్యలు పాటిస్తూ ఈ వేడుకను నిర్వహించనున్నారు. అయితే ఈ పెళ్లి వేడుక తొలుత రాంచీలోని దొరండా గ్రామంలోని ఓ అతిథి గృహంలో చేయాలని నిశ్చయించుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల మొరాబడిలోని వ్రిన్​ధావన్​ బ్యాంకెట్​​ హాలుకు వేదికను మార్చారు.

 

దీపికా కుమారి, అతాను దాస్‌కు 2018 డిసెంబరులో నిశ్చితార్థం జరిగింది. ఇప్పటికే వీరిద్దరూ టోక్యో ఒలింపిక్స్​ మిక్స్​డ్​ ఆర్చరీ విభాగంలో అర్హత సాధించారు. టోర్నీ వచ్చే ఏడాదికి వాయిదా పడిన నేపథ్యంలో, తమ పెళ్లి జరిగిన తర్వాత కూడా ప్రాక్టీసుపై దృష్టి పెడతామని అన్నారు. ధోని ఈ పేరు క్రీడారంగంలో ఓ సంచలనం, మాజీ కెప్టెన్ ధోని ఒకప్పుడు కీలక దశలో ఆయన ఆటను వీక్షించే ఎవరైనా సరే సలాం చెప్పాల్సిందే.. అలాంటి ఆటగాడు మహేంద్రసింగ్ ధోని. ఒకానొక సమయంలో ఇండియాకు మహేంద్రసింగ్ ధోని తప్ప మరో ఆటగాడు అవసరం లేదు అనే ఒక ఆలోచన వచ్చింది. మొదటిలో ధోని కెప్టెన్ గా నెగ్గుకు రాగల డా అనే ఒక మాట వినిపించిన.. అలా అనే వాళ్లకి గట్టిగా వినిపించేలా అతని సారధ్యంలో లో ఎన్నో విజయాలను తెచ్చి పెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: