తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించిన లైవ్ చాట్ లో పాల్గొన్న వెస్టిండీస్ ఆల్ రౌండర్ డారెన్ స్వామి కొన్ని ఆరోపణలు గుప్పించారు. వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ కట్టడికి ఐసీసీ కొత్త రూల్స్ తీసుకు వచ్చిందని ఆయన దుయ్యబట్టారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల ఫాస్ట్ బౌలర్లు బౌన్సర్లు సంధించే సమయంలో తీసుకరాని రూల్ వెస్టిండీస్ ఆటగాళ్లు సక్సెస్ అయ్యే సమయంలో ఆ రూల్ తీసుకువచ్చారని డారెన్ స్వామి తెలియజేశారు. 

 


1990 దశకంలో బౌన్సర్లు కారణంగా ప్రత్యర్థి బ్యాట్స్మెన్స్ ఇబ్బందులు పడుతున్నారని ఐసిసి ఒక్క ఓవర్ కి ఒక బౌన్సర్ మాత్రమే అవకాశం ఇస్తున్నట్లు ప్రవేశపెట్టింది. అయితే ఆ తర్వాత వన్డేలు, టి20లో కి అనుగుణంగా మార్పులు తీసుకవచ్చారు. కానీ ఏ ఫార్మాట్ లో అయినా సరే ఇప్పుడు ఒక ఓవర్ కి కేవలం రెండు బౌన్సర్లు మించి వేయడానికి అనుమతిలేనట్లు తెలియజేశారు. నిజానికి తొంభై దశకంలో వెస్టిండీస్ బౌలర్లు అతి వీర భయంకరంగా ఉండే వారు సహజంగానే ఎత్తు బలిష్టంగా ఉండే వారు. ఒక ఓవర్లో ఏకంగా 6 బంతులు బౌన్సర్లుగా సంధించిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఇక దీంతో బ్యాట్స్మెన్లు క్రీజ్ లో నిలబడేందుకు కూడా జంకేవారు. బౌలర్ ఓవర్ మేడం చేయడం సంగతి పక్కన పెడితే శరీరం పైకి దూసుకు వచ్చే బంతులు దెబ్బలు తగిలి పోకుండా తప్పించుకోవడం ఎలా అని ఆలోచించేవారు. 

 

అలాగే కొంతమంది ఫాస్ట్ బౌలర్లు బ్యాట్స్మన్ అవుట్ చేయడం కంటే ప్రత్యర్థి బ్యాట్స్మెన్ దెబ్బలు తగిలితే ఎక్కువ ఆనందాన్ని వెతుక్కుంటారన్న ఓ వాదన కూడా ఉంది. నిజానికి అలాంటి వాదన ఉన్న అది అది ఏమాత్రం నిజం కాదు. ఒక ఫాస్ట్ బౌలర్ అమ్ములపొదిలో దాగి ఉన్న ప్రధాన ఆయుధం బౌన్సర్. అయితే కొన్ని దేశాల ఆటగాళ్లు బౌన్సర్ లతో బ్యాట్స్మెన్ పై అధికారం కొనసాగించకుండా ఇలాంటి రూల్స్ ప్రవేశపెట్టారు. అయితే వెస్టిండీస్ బౌలర్లు బౌన్సర్ లతో ఆధిపత్యం చెలాయిస్తున్న రోజులలో ఇలాంటి రూమ్ తీసుకోచ్చి వారిపై కట్టడి చేసేందుకు icc కొత్త రూల్స్ అమలు చేసినట్లు సామి ఆరోపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: