ప్రస్తుతం వన్డే మ్యాచ్ లలో, టీ20ల్లో ఇరు జట్ల మధ్య స్కోర్ సమానమైతే సూపర్ ఓవర్ ద్వారా విజేతని తెలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత సంవత్సరం జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పెద్ద సంచలనాలకు దారి తీసింది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్టులో తలపడిన ఆ ఫైనల్ మ్యాచ్లో ఇరు జట్లు సామాన స్కోరు చేయడం మాత్రమే కాకుండా సూపర్ ఓవర్ లో కూడా స్కోర్లు సమం అయ్యాయి. ఇక దాంతో ఇంగ్లాండ్ జట్టు బౌండరీ ఎక్కువగా కొట్టడంతో ప్రపంచ కప్పును ఇంగ్లాండ్ జట్టు కైవసం చేసుకుంది. ఇక ఈ విషయంపై ఆ రోజుల్లో సోషల్ మీడియా లో పెద్ద  వివాదానికి దారితీసిందని చెప్పవచ్చు. ఐసీసీ పెట్టిన రూల్ పై చాలామంది విమర్శకుల నుండి విమర్శలు వెల్లువెత్తాయి. ఇకపోతే ఈ విషయంపై తాజాగా న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్ స్పందించాడు.

 

IHG

 


తాను చెప్పిన దాని ప్రకారం వన్డే ఫార్మాట్లో సూపర్ ఓవర్ అవసరం లేదని టి20 లాంటి పరిమిత ఓవర్ల కైతే సరిపోతుందని ఆయన తెలియజేశారు. మెగా టోర్నమెంట్లో సూపర్ ఓవర్ సమయం అయితే ట్రోఫీని ఇరు జట్లకు పంచాలని ఆయన తెలియజేశారు. ఎప్పుడు నుండో ఆడుతున్న ఈ వన్ డే ఫార్మేట్ లో దాదాపు 100 ఓవర్ల మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా విజేత ఎవరన్నది తేలకపోతే టైటిల్ ఇరు జట్లకు సమానంగా ఇవ్వాలని, అప్పుడు సంయుక్త విజేతగా ప్రకటించాలని రాస్ టేలర్ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. మొత్తంగా ఈ సూపర్ ఓవర్ ని టి20లో మాత్రమే ఉంచి వన్డే మ్యాచ్లలో తీసేయాలని అతను తెలియజేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: