ఇంగ్లాండ్ పర్యటన కోసం ఇటీవల పీసీబీ(పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) 29మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది అయితే వారికి మొదటి సారి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 10మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా మరోసారి ఆటగాళ్లందరికి పరీక్షలు చేయగా ఈ10మంది లో 6గురికి నెగిటివ్ వచ్చింది. అందులో హఫీజ్ , రియాజ్ ,హస్నైన్ , రిజ్వాన్ , ఫకర్ జమాన్ ,షాదాబ్ ఖాన్ లు ఉండగా కషిప్ బట్టి ,హైదర్ అలీ , ఇమ్రాన్ ఖాన్ , హారిస్ రవూఫ్ లకు మాత్రం మళ్ళీ పాజిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చిన ఈ ఆరుగురు ఆటగాళ్లకు పీసీబీ మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించనుంది ఒకవేళ అందులో కూడా నెగిటివ్ వస్తే వీరు కూడా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్నారు. 
 
ఇదిలావుంటే రేపు మొత్తం 20మంది ఆటగాళ్లు, ఇంగ్లాండ్ కు వెళ్లనున్నారు. వీరిలో ఫాస్ట్ బౌలర్ ముసా ఖాన్ మరియు వికెట్ కీపర్ రోహాలి నజీర్ ,స్క్వాడ్ లో కొత్తగా చేరారు. కాగా పాక్ జట్టు ఇంగ్లాండ్ చేరిన అనంతరం 14 రోజుల పాటు వర్సెస్టర్ లో ఐసోలేషన్ లో ఉండనున్నారు ఆ తరువాత జులై 13నుండి డర్బిషైర్ లో ప్రాక్టీస్ చేయనుంది. ఈ పర్యటనలో ఆతిథ్య జట్టు తో పాక్ మూడు టెస్టులు,మూడు టీ 20ల్లో తలపడనుంది. 
 
జట్టు : అబిద్ అలీ ,ఇమామ్ ఉల్ హాక్ , షాన్ మసూద్ , అజార్ అలీ (టెస్టు కెప్టెన్), బాబర్  అజామ్( టీ 20 కెప్టెన్), అసద్ షఫీక్ , ఫవాద్ ఆలమ్ ,ఇఫ్తికర్ అహ్మద్,కుష్ దిల్ షా ,సర్ఫరాజ్ (కీపర్), ఫహీమ్ అష్రాఫ్ , అబ్బాస్ , నసీం షా , షహీన్ షా ఆఫ్రిది ,సోహైల్ ఖాన్ ,ఉస్మాన్ షాన్వారి , ఇమాద్ వసీం , యాసిర్ షా ,ముసా ఖాన్ ,రోహాలి నజీర్ 

మరింత సమాచారం తెలుసుకోండి: