గత సంవత్సరం ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ తర్వాత మహేంద్రసింగ్ ధోని మళ్ళీ క్రికెట్ ఆడలేదు. అయితే ఆ తర్వాత ఆయన సైన్యంలో చేరి కొద్దిరోజుల పాటు సేవలందించారు కూడా. ఇకపోతే తాజాగా భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన పొలంలో సేంద్రియ వ్యవసాయం చేస్తూ తీరికలేకుండా సమయాన్ని గడిపేస్తున్నారు. తన పొలంలో పుచ్చకాయలు, బొప్పాయి వంటి పంటలను సాగు చేస్తున్నాడు ధోని. అందుకోసం తానే స్వయంగా ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నుతున్నాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

 

 

 


ఇకపోతే ఇంతకుముందు సోషల్ మీడియా ద్వారా తన పొలంలో సేంద్రీయ పద్ధతిలో పంటలను పండించ బోతున్నట్లు వెల్లడించిన విషయం అందరికీ విదితమే. అయితే తన పొలంలో పండ్ల తోటల సాగు పై ఆయన ఆసక్తి కనబరుస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు గ్రౌండ్ లో బ్యాట్ తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన ధోని ఇప్పుడు తన వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేస్తూ ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు. కరోనా పుణ్యమా అని క్రికెట్ టోర్నీ లకు దూరమవడంతో తనకు దొరికిన అమూల్యమైన సమయాన్ని ధోని ఇలా తన ఫాంహౌస్ లోనే వివిధ రకాలుగా ఎంజాయ్ చేస్తున్నాడు.

 

ఈ సంవత్సరం మార్చిలో జరగాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ ద్వారా తన రీ ఎంట్రీ ని ఇద్దాం అనుకున్న ధోని కి కరోనా వైరస్ దెబ్బ వేసింది. ఐపీఎల్ సీజన్ ద్వారా తన ఫామ్ ని చూపించి తద్వారా ఈ సంవత్సరం జరగబోయే ప్రపంచకప్ కు ఎన్నిక అవుదామనుకున్నా ధోని కి నిరాశే మిగిలింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: