మరో 9రోజుల్లో అంతర్జాతీయ క్రికెట్ పున: ప్రారంభం కానుంది. జులై 8న సౌతాంఫ్టన్ వేదికగా ఇంగ్లాండ్ - వెస్టిండీస్ ల మధ్య మొదటి  టెస్టు ప్రారంభం కానుంది. మొత్తం మూడు టెస్టుల సిరీస్ కోసం విండీస్ ఇప్పటికే ఇంగ్లాండ్ కు చేరుకొని సాధన మొదలుపెట్టింది. ఇక ఈటెస్టు సిరీస్ కు విండీస్ ఆటగాళ్ల జెర్సీలపై 'బ్లాక్ లీవ్స్ మ్యాటర్' అనే లోగో  దర్శమివ్వనుంది. జాతి వివక్షకు వ్యతిరేకంగా విండీస్ ఆటగాళ్లు  ఈలోగో వున్న జెర్సీల తో బరిలోకి దిగనున్నారని క్రికెట్ వెస్టిండీస్ వెల్లడించింది.
కాగా మొదటి టెస్టు కు ఈసీబీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బయో సెక్యూర్ వాతావరణంలో ప్రేక్షకులు లేకుండా ఈ సిరీస్ జరుగనుంది. ఈటెస్టు సిరీస్ కు 21 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది క్రికెట్ వెస్టిండీస్. ఇందులో 14మంది జట్టు సభ్యులు కాగా మరో 11మందిని రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపికచేసింది.
 
ఇక ఈసిరీస్ తరువాత సొంత గడ్డపై ఇంగ్లాండ్, పాకిస్థాన్ తో తలపడనుంది. ఈపర్యటనలో పాక్ తో ఆతిథ్య జట్టు  మూడు టెస్టులు,మూడు టీ 20ల సిరీస్ ఆడాల్సివుంది. ఈసిరీస్ కోసం మొత్తం 20మంది ఆటగాళ్లతో కూడిన పాక్ జట్టు ఈరోజు ఉదయం మాంచెస్టర్ కు చేరుకుంది. 14రోజుల ఐసోలేషన్ ముగిసిన అనంతరం డర్బి షైర్ లో పాక్ ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: