వెస్టిండీస్ తో జరుగనున్న మొదటి టెస్టు కు ఇంగ్లాండ్ కెప్టెన్  జో రూట్ దూరం కానున్నాడు. వచ్చే నెల మొదటి వారం లో రూట్ సతీమణి  రెండో బిడ్డకు జన్మనివ్వనుంది దాంతో రూట్ మొదటి టెస్టు కు అందుబాటులో ఉండడం లేదు. రేపు ట్రైనింగ్ క్యాంప్ వీడనున్న రూట్ జూలై 14న మళ్ళీ జట్టు తో కలవనున్నాడు. ఇక మొదటి టెస్టు కు రూట్ తప్పుకోవడంతో స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్, సారథిగా వ్యవహరించనుండగా వైస్ కెప్టెన్ బాధ్యతలను జాస్ బట్లర్ మోయనున్నాడు. కాగా స్టోక్స్ కెరీర్ లో కెప్టెన్ గా వ్యవహరించనుండడం అతనికి ఇదే మొదటి సారి. 
 
ఇక ఈసీబీ మొదటి టెస్టుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వచ్చే నెల 8న సౌతాంఫ్టన్ వేదికగా ఇరు జట్ల మొదటి టెస్టు జరుగనుంది. గత కొంత కాలంగా  కరోనా వల్ల అంతర్జాతీయ క్రికెట్  స్థంభించిపోగా ఈమ్యాచ్ తో తిరిగి ప్రారంభం కానుంది. ఈసిరీస్ బయో సెక్యూర్ వాతావరణంలో జరుగనుండగా మ్యాచ్ లను వీక్షించేందుకు మైదానాల్లోకి  ప్రేక్షకులకు అనుమతి లేదు. ఇండియా లో ఈసిరీస్ ను సోనీ సిక్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. 
 
ఈటెస్టు సిరీస్ కు మొత్తం 21 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది క్రికెట్ వెస్టిండీస్. ఇందులో 14మంది జట్టు సభ్యులు కాగా మరో 11మందిని రిజర్వ్ ఆటగాళ్లుగా ఉండనున్నారు అయితే కరోనా భయం వల్ల  స్టార్ ఆటగాళ్లు హేట్మేయర్ , బ్రావో , కీమో పాల్ ఈ పర్యటనకు నుండి తప్పుకున్నారు. ఈ సిరీస్ తరువాత సొంత గడ్డపై ఇంగ్లాండ్, పాకిస్థాన్ తో తలపడనుంది. ఈపర్యటనకోసం పాకిస్థాన్ జట్టు ఇప్పటికే ఇంగ్లాండ్ కు చేరుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: