రాబోయే ఆస్ట్రేలియా పర్యటనలో భారత ఓపెనర్ రోహిత్ శర్మ కి ఆస్ట్రేలియా బౌలర్స్ నుండి గట్టి సవాల్ ఎదురు కాబోతోంది అని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకెల్ హస్సి హెచ్చరికలు జారీ చేశాడు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్ళబోతున్న టీమిండియాకు అక్కడ ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు మ్యాచులు ఆడనుంది. చివరిసారిగా వెళ్లి వచ్చిన పర్యటనలో ఆస్ట్రేలియా పై 2-1 తేడాతో ఓడించి భారత జట్టు ఏడు దశాబ్దాలు నిరీక్షణ తర్వాత వారి గడ్డపై విజయం సొంతం చేసుకొని సిరీస్ ను కైవసం చేసుకుంది.

 

IHG

 

ఇక అసలు విషయంలోకి వెళితే... 2019 దక్షిణాఫ్రికా సిరీస్ కంటే ముందు వరకు మిడిల్ ఆర్డర్ లో రోహిత్ శర్మ వచ్చేవాడు. అయితే దక్షిణాఫ్రికా సిరీస్ తో అతను వన్డే మాదిరి టెస్టుల్లో కూడా ఓపెనర్ గా అవతారమెత్తాడు. అంతే కాదు ఏకంగా గత సంవత్సరం ఆ మూడు టెస్టుల సిరీస్ లో వరుసగా 176, 127, 212 పరుగులు చేసి రోహిత్ శర్మ ఔరా అనిపించాడు. దీనితో గత సంవత్సరం రోహిత్ శర్మ 92.6 సగటుతో ఏకంగా 546 పరుగులు చేసి మంచి ఊపు మీద ఉన్నాడు.

 


అయితే ఇప్పుడు చాలా గ్యాప్ రావడంతో మళ్లీ అదే ఫామ్ అందుకోవడం నిజంగా కాస్త కఠినతరమైన పని. అయితే గత సంవత్సరం నుండి టెస్టుల్లోనూ రోహిత్ శర్మ తన వీర ప్రతాపం చూపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇక రాబోయే ఆస్ట్రేలియా సిరీస్ లో కూడా రోహిత్ శర్మ తన బ్యాటింగ్ విశ్వరూపాన్ని చూపిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఆస్ట్రేలియా పిచ్లపై అది ఆస్ట్రేలియా బౌలర్లలో ఎదుర్కోవడం అంత సులువు కాదని రోహిత్.. ఈ సిరీస్ పెద్ద సవాలుగా మారుతుందని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: