పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్ మెన్ బాబర్ అజామ్ టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోల్చవద్దని మాట్లాడు. గత కొన్ని రోజుల నుండి చాలా మంది బాబర్ అజామ్ ను  పోలుస్తున్న సంగతి అందరికీ విదితమే. దీనిపై బాబర్ అజామ్ స్పందిస్తూ కోహ్లీతో పోల్చడాన్ని పెద్దగా నేను ఆస్వాదించాలని మాట్లాడాడు. పాకిస్థాన్ జట్టుకు t20 వన్డే జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతున్న బాబర్ అజామ్ విలేకరులతో టెలీ కాన్ఫరెన్స్ లో ఈ విషయాన్ని తెలియజేశాడు.ఇందులో భాగంగా తాను కోహ్లీతో పోల్చడంతో తానేమి పొంగిపోలేదని తెలియజేశాడు. అయితే నన్ను పాకిస్తాన్ దిగ్గజాలైన ఇంజమామ్  హక్, మియాందాద్, యూనిస్ ఖాన్ లాంటి ఆటగాళ్లతో నన్ను పోసినప్పుడు నేను దానిని ఎక్కువగా ఆస్వాదిస్తాను అని తెలిపాడు. వారితో నన్ను పోలిస్తే నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను అంటూ తెలియజేశాడు.

 


అంతే కాకుండా నన్ను ఎవరైనా నా ఎవరితో అయినా పోల్చినప్పుడు అది కూడా కేవలం పాకిస్తాన్ ఆటగాళ్లతో మాత్రమే పోలిస్తే ఆస్వాదిస్తారని ఆయన తెలిపాడు. ఇకపోతే కోహ్లీతో పోల్చిన సందర్భంగా తనని కోహ్లితో పోల్చడం అప్పుడే నేను గౌరవంగా అ భావిస్తానని తెలిపాడు. నన్ను ఎవరైనా పోల్చాలి అనుకుంటే కేవలం పాకిస్తాన్ ఆటగాళ్ళ తోనే పోల్చండి అప్పుడు మాత్రమే నాకు గొప్పగా అనిపిస్తుంది అని పాకిస్తాన్ కెప్టెన్ తెలియజేశాడు.

 


ప్రస్తుతం పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ టీ20ల్లో మొదటి ర్యాంకులో ఉండగా, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డే ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక దీంతో అజామ్ ను విరాట్ కోహ్లీతో పోల్చడం పరిపాటి అయిపోయింది. ఈ విషయంపై ఆయన తాజాగా బాబర్ అజామ్ ఇలాంటి మాటలు మాట్లాడాడు. విరాట్ కోహ్లీ సాధించిన ఘనత పరంగా చూస్తే పాకిస్తాన్ కెప్టెన్ అందుకోలేనంత దూరంలోనే ఉన్నాడు అయినప్పటికీ విరాట్ కోహ్లి తో పోలిస్తే తనకు ఇష్టం ఉండదని మీడియా పూర్వకంగా చెప్పడం నిజంగా గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: