ఇంగ్లాండ్ యువ ఆల్ రౌండర్ సామ్ కర్రాన్ కు కరోనా నెగిటివ్ అని నిర్ధారణ కావడంతో ఇంగ్లాండ్ జట్టు ఊపిరి పీల్చుకుంది. వెస్టిండీస్ తో టెస్టు సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ జట్టు ,రెండు జట్లుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్నాయి ఈ నేపథ్యంలో బుధవారం కర్రాన్ అనారోగ్యానికి గురి కావడంతో ఇంగ్లాండ్ టీం లో కలకలం రేగింది. మెడికల్ టీం, కర్రాన్ ను సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉంచి కరోనా టెస్టులు చేయించగా అందులో నెగిటివ్ అని వచ్చింది దాంతో ఆటగాళ్ల తోపాటు ఈసీబీకి ఉపశమనం లభించింది. రెండు రోజుల తరువాత కర్రాన్  జట్టుతో కలువనున్నాడు.  
 
ఇక మరో 5రోజుల్లో ఇంగ్లాండ్- వెస్టిండీస్ ల మధ్య మొదటి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. బయో సెక్యూర్ వాతావరణంలో దాదాపు నాలుగు నెలల తరువాత  జరుగుతున్న మొదటి అంతర్జాతీయ టెస్టు కావడంతో ఈమ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు ఈమ్యాచ్ కు ఈసీబీ అన్ని ఏర్పాట్లు చేసింది. మూడు టెస్టుల సిరీస్ కోసం గత నెలలోనే విండీస్, ఇంగ్లాండ్ కు చేరుకోగా ప్రస్తుతం ముమ్మరంగా సాధన చేస్తుంది.
 
ఇక మొదటి టెస్టు కు ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ వ్యక్తిగత కారణాల వల్ల అందుబాటులో ఉండడం లేదు దాంతో వైస్ కెప్టెన్ బెన్ స్టోక్స్, సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. కెప్టెన్ గా స్టోక్స్ కు ఇదే మొదటి మ్యాచ్  కానుండడం విశేషం కాగా కీపర్ జాస్ బట్లర్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈసిరీస్ తరువాత సొంత గడ్డపై ఇంగ్లాండ్, పాకిస్థాన్ తో టెస్టు , టీ 20 సిరీస్ లో తలపడనుంది. ఇందుకోసం పాక్ జట్టు కొద్దీ రోజుల క్రితం ఇంగ్లాండ్ కు చేరుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: