మొన్నటి వరకు శ్రీలంక లో 2011లో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్ అయిందంటూ వచ్చిన ఆరోపణలను తోసిపుస్తు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఒక క్లారిటీ ఇచ్చింది. ఇకపోతే ఇటీవల శ్రీలంకకు చెందిన మాజీ క్రీడల మంత్రి మహిదానంద " శ్రీలంక జట్టు ఫైనల్లో అమ్ముడుపోయింది " అంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశాడు.

 

IHG

 

ఈ నేపథ్యంలో ఆ ఫైనల్ పై ఇన్వెస్టిగేషన్ కు ఓ స్పెషల్ టీము శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా మొదటగా ఆరోపణలు చేసిన మహిదానంద నుండి స్టేట్మెంట్ రికార్డ్ తీసుకున్నారు.

 

IHG

 

ఇక ఆ తర్వాత వరుసగా అప్పటి చీఫ్ సెలక్టర్ అరవింద డిసిల్వా, శ్రీలంక ఓపెనర్ ఉపుల్ తరంగా, అలాగే శ్రీలంక అప్పటి కెప్టెన్ కుమార సంగక్కరన లకు విడివిడిగా విచారించి వారి వాంగ్మూలాలను తీసుకుంది. ఈ విచారణలో వారికి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో శ్రీలంక స్పోర్ట్స్ మినిస్టర్ సెక్రటరీకి రిపోర్టు సమర్పించింది. ఆ తర్వాత ఈ విషయంపై ఐసిసి కూడా స్పందన తెలియజేసింది.

 

IHG


2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ పై మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిన ఆరోపణలు తీవ్రంగా పరిగణిస్తోందని, అయితే ... ఇప్పటివరకు ఆ ఫిక్సింగ్ పై ఎలాంటి ఆధారాలు లభించలేదు కాబట్టి ఇక అనుమానం వ్యక్తం చేయడానికి అవకాశమే లేదని ఐసీసీ మండలి అవినీతి నిరోధక శాఖ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: