గురువారం నుండి వెస్టిండీస్ తో జరుగనున్న మొదటి టెస్టుకు జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్. మొత్తం ఈటెస్టుకు 13మంది ఆటగాళ్లను ఎంపిక చేయగా మరో 9మందిని రిజర్వ్ ఆటగాళ్లగా తీసుకుంది అయితే ఈజాబితాలో కీపర్ జానీ బెయిర్ స్టో ,ఆల్ రౌండర్ మోయిన్ అలీకి స్థానం దక్కలేదు.
 
ఇక ఈమ్యాచ్ కు ఈసీబీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈటెస్టుతో అంతర్జాతీయ క్రికెట్ తిరిగి ప్రారంభం కానుండడంతో ఈమ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
మొత్తం మూడు టెస్టుల సిరీస్ లో మొదటి టెస్టు జులై 8-12 వరకు సౌతాంఫ్టన్ లోని ఏజెస్ బౌల్ వేదికగా జరుగనుండగా రెండో టెస్టు జులై 16-20 వరకు, మూడో టెస్టు జులై 24-28  వరకు మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికలో జరుగనున్నాయి. ఈమూడు టెస్టులు కూడా ప్రేక్షకులు లేకుండానే ఖాళీ మైదానాల్లో జరుగనున్నాయి. కాగా మొదటి టెస్టుకు ఇంగ్లాండ్ కెప్టెన్  జో రూట్ అందుబాటులో ఉండడం లేదు దాంతో వైస్ కెప్టెన్ బెన్ స్టోక్స్, సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. కెప్టెన్ గా స్టోక్స్ కు ఇదే మొదటి మ్యాచ్. 
 
ఇంగ్లాండ్ జట్టు : స్టోక్స్(కెప్టెన్), బట్లర్ (వైస్ కెప్టెన్/ కీపర్), అండర్ సన్ , ఆర్చర్ , బ్రాడ్ , మార్క్ వుడ్ , జాయ్ డెన్లీ , క్రిస్ వోక్స్ , రోరీ బర్న్స్ ,ఓల్లి పోప్ ,సిబ్లే , జాక్ క్రాలే,  డామ్ బెస్ 
రిజర్వ్ ఆటగాళ్లు : 
సామ్ కర్రాన్ , బెన్ ఫోక్స్ ,జాక్ లీచ్ , డాన్ లారెన్స్ ,షకీబ్ మహమూద్ ,ఓవర్ టోన్ ,రాబిన్సన్,ఓల్లి స్టోన్, బ్రాసీ

మరింత సమాచారం తెలుసుకోండి: