కరోనా వైరస్ పుణ్యమా అని ప్రపంచం మొత్తం క్రీడా రంగం పూర్తిగా కుంటుపడింది. దీంతో ప్రపంచం మొత్తం మీద అన్ని క్రీడలకు సంబంధించి పెద్ద పెద్ద టోర్నమెంట్లు పూర్తిగా రద్దయ్యాయి. అలాగే భారత్ నిర్వహించనున్న ఐపీఎల్ 2020 సీజన్ కూడా వాయిదాపడిన సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి ఐపీఎల్ మొదలుపెట్టడానికి సన్నాహాలను ప్రారంభిస్తోంది. ఈ సంవత్సరం చివర్లో అక్టోబర్ 18 నుండి నవంబర్ 16 వరకు టి20 వరల్డ్ కప్ జరగాల్సి ఉండగా దానిని కాస్త ఐసీసీ వాయిదా వేస్తూనే ఉంది. అయితే ఈ సమయంలో ఐపీఎల్ 2020 సీజన్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.

 

IHG

 

ఒకవేళ ఐపీఎల్ 2020 సీజన్ జరగకపోతే బీసీసీఐ ఏకంగా నాలుగు వేల కోట్ల రూపాయలను నష్టపోవాల్సి వస్తుంది. ఇక ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనైనా ఐపీఎల్ నిర్వహించి తీరాలని బీసీసీఐ ఎంతో దృడంగా ఉంది. ఈ విషయంపై బీసీసీఐ ఆచితూచి వ్యవహరిస్తుంటే మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సెప్టెంబర్-నవంబర్ మధ్య ఆసియా కప్ 2020 నిర్వహించాలని, అలాగే పాకిస్తాన్ సూపర్ లీగ్ ను కూడా నిర్వహించాలని ప్రణాళికలు చేసుకుంటుంది.

 

IHG

 

ఇకపోతే తాజాగా భారతదేశంలో కరోనా వైరస్ అదుపులోకి రాకపోవడంతో ఈ ఐపీఎల్ సీజన్ ని శ్రీలంక లేదా యూఏఈ లో నిర్వహిస్తామని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిందని చెప్పవచ్చు.కాకపోతే ఈ విషయానికి సంబంధించి ఎలాంటి ప్రాథమిక నిర్ణయం ఇంకా తీసుకోలేదు. నిజానికి ఐపీఎల్ టోర్నమెంట్ పూర్తిగా నిర్వహించాలంటే ఏకంగా 45 రోజులకు కచ్చితంగా అవసరం. అంతే కాదు అదే సమయంలో ఇతర చోట్ల కూడా ఎలాంటి మ్యాచ్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం బీసీసీఐ పై ఎంతైనా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: