భారత దిగ్గజ బ్యాట్స్ మెన్ సచిన్ టెండూల్కర్ ని ‘గాడ్ ఆఫ్ క్రికెట్’ అని  అంటారని అందరికీ తెలుసు. అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టిన సచిన్ టెండూల్కర్ అనేక మైలురాళ్లను సాధించడం జరిగింది. ప్రపంచంలో లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్ మెన్ గా..అత్యధిక సెంచరీలు మరియు హాఫ్ సెంచరీలు సాధించిన క్రికెటర్ గా సచిన్ అనేక రికార్డులు తన పేరిట ఇంటర్నేషనల్ క్రికెట్ స్థాయిలో సాధించడం జరిగింది. అటువంటి సచిన్ టెండూల్కర్ క్రీజులో ఉండిన టైం లో అతనికి బౌలింగ్ వేయాలంటే భయపడినట్లు కొంతమంది రిటైరయ్యాక పలు ఇంటర్వ్యూలలో తెలపడం మనం చూశాం.

 

ఆస్ట్రేలియా బౌలర్ షేన్ వార్న్ ఈ విధంగానే ఓఇంటర్వ్యూలో అప్పట్లో కామెంట్లు చేశారు. ఇదిలా ఉండగా ప్రపంచచరిత్రలో 90లో బౌలర్‌గా ఓ వెలుగు వెలిగిన వెస్టిండీస్ ఆటగాడు మాజీ పేసర్‌, వ్యాఖ్యాత ఇయాన్‌ బిషప్‌ ఇటీవల ‘క్రికెట్‌ కనెక్టెడ్‌’ అనే కార్యక్రమంలో ఇటీవల పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి అనేక విషయాలు మాట్లాడుతూ సచిన్ సందర్భం వచ్చిన టైంలో...అతి చిన్న వయసులోనే సచిన్ క్రికెట్ లోకి వచ్చిన టైం లో అప్పట్లో నేను ప్రపంచ స్థాయిలో మంచి పేసర్ బౌలర్ గా ఉన్నా. కానీ సచిన్ కు బౌలింగ్ వేయాలంటే అతని ఆటతీరు ఆడిన విధానం చూసి నాకే భయం వేసింది అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

బిషప్‌ మాట్లాడుతూ... నేను నా కెరియర్లో చాలామంది దిగ్గజ ఆటగాళ్లకు బౌలింగ్  చేశాను. కానీ వారందరిలో నాకు సచిన్ కు బౌలింగ్ చేయడమే కష్టం అనిపించింది. ఎందుకుకంటే... సచిన్ ఎక్కువ స్ట్రైట్‌డ్రైవ్‌లు ఆడుతాడు. ఆ టెక్నిక్‌ ఏ మాకు శాపంలాగా మారింది. అతన్ని ఇబ్బంది పెట్టడానికి ఎలాంటి బంతి వేసిన చాలా సులువుగా టెక్నిక్ తో బంతిని పెవిలియన్ కి చాలాసార్లు పంపించాడు. అందువల్ల అతడు క్రీజులో ఉన్న టైంలో బౌలింగ్ చేయాల్సి వస్తే కొద్దిగా భయపడేవాడిని అంటూ నిర్మొహమాటంగా  వెస్టిండీస్‌ మాజీ పేసర్‌, వ్యాఖ్యాత ఇయాన్‌ బిషప్‌ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: