టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మంగళవారం 37వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. భారత దేశానికి రెండు వరల్డ్ కప్ లు అందించిన భారత కెప్టెన్ గా అలాగే ప్రపంచ క్రికెట్ లో మూడు ఐసిసి ట్రోపి లు అందుకున్న ఒకే ఒక్క కెప్టెన్ గా చరిత్రలో నిలిచిపోయారు. భారత క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న ఆటగాడు అతనే.

 

 

అయితే 2008, 2009లోధోని వరుసగా ఐసీసీ వన్డే ప్లేయర్ అఫ్ ది ఇయర్ గా ఎంపికైయ్యారు. అయితే అప్పటి వరకు ఈ అవార్డు ను రెండుసార్లు అందుకున్న ఏకైక ఆటగాడు ధోనీనే అని అన్నారు.  కెప్టెన్ గా ఎంపికైన తర్వాత నుండి జట్టును విజయ పథంలో నడిపిస్తున్న ధోని 2011 లో భారత 28 ఏళ్ళ కలను నెరవేర్చారు. 2011 లో జరిగిన వన్డే  ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో 79 బంతుల్లో 91 పరుగులతో  నాట్ ఔట్  నిలిచి భారత్  కు ప్రపంచ కప్ అందించారు. 

 

 

ఐసీసీ టోర్నమెంట్ల ఓటముల తర్వాత 2017 జనవరి లో వన్డే, టీ 20 కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకున్నారు. ఇక అప్పటినుండి ధోని కెరియర్ పై అనుమానాలు మొదలయ్యాయి. గత సంవత్సరం జరిగిన వన్డే ప్రపంచ కప్ తర్వాత నుండి జట్టుకి దూరంగా ఉంటున్నాడు ధోని. అలాగే బీసీసీఐ  తమ కాంట్రాక్టులో కూడా ధోనికి చోటు కల్పించలేదన్న విషయం తెలిసినదే. 

 

 

2013 ఛాంపియన్ ట్రోఫీ విజయంతో క్రికెట్ చరిత్రలో అన్ని ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న ఏకైక కెప్టెన్ గా నిలిచ్చారు ధోని. కేవలం భారత జట్టునే కాకుండా ఐపీఎల్ లోతన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మూడు సార్లు టైటిల్ అందించారు. మిస్టర్ కూల్ కెప్టెన్ గా ఉండి అందరికి ఆదర్శ ప్రాయంగా నిలిచిన మహేంద్ర సింగ్ ధోనీకి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: