చైనాలో వెలుగులోకి వచ్చిన మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా పాకి పోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా  వైరస్ ప్రభావం లేని దేశం లేదు అనడంలో అతిశయోక్తి లేదు. దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను కదిలిస్తోంది ఈ మహమ్మారి వైరస్. ఇక ఈ మహమ్మారి వైరస్ బారినపడి ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది కరోనా రక్కసి . అయితే ఈ మహమ్మారి వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల క్రీడలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు  ఉన్న క్రికెట్ కి కష్టాలు వచ్చాయి 


ఇప్పటికే ఇండియాలో ఐపీఎల్ జరగాల్సి ఉంది... అంతే కాకుండా ప్రపంచ కప్ కూడా చేరువలో ఉంది ఇక ఎన్నో దేశాలు ఎన్నో మ్యాచ్ లు ఆడాల్సి ఉంది కానీ ఇవన్నీ నిలిచిపోయాయి. అయితే మొన్నటి వరకు లాక్ డౌన్ అమలులో ఉండగా దాదాపుగా అన్ని దేశాలలో అన్లాక్ కొనసాగుతోంది. అయితే లాక్ డౌన్ అయితే పూర్తయింది కానీ మైదానంలోకి దిగి  క్రికెట్ ఆడేందుకు ఆటగాళ్లకు అనుమతి మాత్రం లభించడం లేదు. అయినప్పటికీ కొన్ని కొన్ని దేశాల క్రికెట్ బోర్డులు మ్యాచ్ లు  నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే,. ఈ నేపథ్యంలో కరోనా  వైరస్ లాక్ డౌన్ పూర్తయిన తర్వాత మొదటి సారి క్రికెట్ మ్యాచ్ జరగనుంది. కరోనా  వైరస్ వ్యాప్తి ఇప్పట్లో తగ్గే అవకాశం లేకపోవడంతో మ్యాచ్ లను  నిర్వహించేందుకు నిర్ణయించారు.



ఇంగ్లాండ్ వెస్టిండీస్ మధ్య జూలై 8 నుంచి మొదటి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది.  మామూలుగా అయితే ఏదైనా క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అంటే ఎంతో మంది అభిమానులు స్టేడియంకు చేరుకుంటారు . కానీ ఇప్పుడు మాత్రం అలాంటివి ఏమి కుదరదు ప్రేక్షకులను స్టేడియాలకు అనుమతించడం లేదు. మరి స్టేడియంలో ప్రేక్షకులు లేకపోతే ఆటగాళ్లలో ఉత్సాహం నిండేది ఎలా  అని అంటారా... దానికి కూడా ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు.అంతకు  ముందు ఫుల్లుగా ప్రేక్షకులు ఉండి ఈలలు  గోలల తో ఉన్న శబ్దాన్ని ఆడియో రూపంలో స్టేడియంలో ఆటగాళ్లలో ఉత్సాహం నింపేందుకు ప్లే చేస్తూ ఉంటారు. ఇలా మొదటి సారి ఎలాంటి ప్రేక్షకులు లేని  మ్యాచ్ జరుగనుంది.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: