మహేంద్ర సింగ్ ధోనీ ఇది పేరు మాత్రమే కాదు ఒక బ్రాండ్. అంతర్జాతీయ క్రికెట్లో ధోని అంటే ఒక సంచలనం. 2004 సంవత్సరం లో భారత క్రికెట్ జట్టులో ఎంటర్ అయిన ఈ జార్ఖండ్ డైనమైట్ తొలుతగా వికెట్ కీపర్ గా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టాడు. టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ నుండి కెప్టెన్ బాధ్యతలు అందుకొని టీమిండియాకు ఎనలేని అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఏదైనా పరిస్థితులలో మ్యాచ్ ఉన్న ధోనీ క్రీజులో ఉన్నారు అంటే భారత్ ఎలాగైనా గెలుస్తుందని అభిమానుల నమ్మకం.

 

ఒకవేళ ఏదైన మ్యాచ్ ఎంత రసవత్తరంగా ఉన్న ఎక్కడ ఆవేశపడకుండా చాలా కూల్ గా నిర్ణయాలు తీసుకోవడంలో ధోని ని మించిన కెప్టెన్ లేడు. మరోవైపు ఎప్పుడైనా అంపైర్ తప్పు చేస్తాడేమో కానీ, డిఆర్ఎస్ విధానంలో మాత్రం ధోని ఖచ్చితత్వం నిజంగా అమోఘం. బ్యాటింగ్ లో తన దూకుడును ప్రదర్శిస్తూనే అంతర్జాతీయ మ్యాచ్ లలో బెస్ట్ ఫినిషర్ గా పేరు పొందాడు.

 

ఒక 1983లో గెలిచిన వరల్డ్ కప్ తర్వాత 2011లో ధోనీ సారథ్యంలో రెండవ సారి వరల్డ్ కప్ గెలుచుకోగా, అంతకుముందే 2007 సంవత్సరంలో టి20 వరల్డ్ కప్, ఆ తర్వాత 2013 లో ఛాంపియన్స్ ట్రోఫీ నీ ధోనీ కెప్టెన్సీలోని భారత్ గెలుచుకుంది. ఇకపోతే నేడు తన పుట్టినరోజు సందర్భంగా గా వెస్టిండీస్ ఆల్ రౌండర్ బ్రేవో ధోనిపై ఒక వీడియోను ద్వారా పోస్ట్ చేశాడు. అంతే కాకుండా పలువురి క్రికెట్ దిగ్గజాల నుండి, అలాగే దేశ నలుమూలల నుండి ధోని కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: