భారత్ కు కెప్టెన్ గా పలు విజయాలు అందించి, ఎడమ చేతి బ్యాటింగ్, కుడి చేతితో మీడియం ఫేస్ బౌలింగ్ చేయగల క్రికెటర్ సౌరవ్ చండీదాస్ గంగూలీ. బుధవారంతో 48 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం బీసీసీఐ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. పుట్టినరోజు సందర్భంగా దాదా గురించి తెలుసుకుందాం.

 

 

దాదాను బెంగాల్ టైగర్, కోల్ కత యువరాజు, దాదా అనే ముద్దు పేర్లు. 2002 నుంచి 2005 వరకు భారత టెస్ట్ జట్టుకు న్యాయకత్వం వహించి, అత్యధిక టెస్ట్ విజయాలు (21) సాధించిపెట్టిన భారత కెప్టెన్ గా ఘనత సాధించారు. 2008 అక్టోబర్ వరకు భారత క్రికెట్ జట్టుకు ముందుండి నాయకత్వం వహించి ఆస్ట్రేలియాతో జరిగిన చివరిన టెస్ట్ మ్యాచ్ ఆడి రిటైర్ అయ్యారు. 

 

 

 

సౌరవ్ గంగూలీ తన కెప్టెన్సీ కాలంలో యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, మహేంద్రసింగ్ ధోనీ లాంటి క్రికెటర్లకి వరుస అవకాశాలిచ్చాడు. అతని కెప్టెన్సీలో 146 వన్డేలాడిన టీమిండియా.. 76 మ్యాచ్‌ల్లో గెలుపొంది 65 మ్యాచ్‌ల్లో ఓడింది. ఇంకో ఐదు మ్యాచ్‌ల్లో మాత్రం ఫలితం తేలలేదు. టెస్టు ఫార్మాట్‌లోనూ అతని కెప్టెన్సీలో భారత్ జట్టు 49 మ్యాచ్‌లు ఆడగా.. ఇందులో 21 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇక 13 మ్యాచ్‌ల్లో ఓడిపోగా.. 15 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

 

 

విదేశీ ఆటగాళ్లు స్లెడ్జింగ్‌కి దిగుతుంటే అప్పటి వరకూ మౌనంగా ఉండిపోయిన భారత క్రికెటర్లు.. గంగూలీ కెప్టెన్సీలోనే ధీటుగా బదులివ్వడాన్ని నేర్చుకున్నారు. ఈ క్రమంలో విదేశాల్లోనూ భారత్ జట్టు తన ఆధిపత్యాన్ని ప్రదర్శించగలిగింది. 2003లో గంగూలీ కెప్టెన్సీలోనే టీమిండియా ఫైనల్‌కి చేరింది. కానీ.. తుది పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. భారత్ తరఫున 113 టెస్టులు, 311 వన్డేలాడిన గంగూలీ.. ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: