గల్లీ నుండి ఢిల్లీ దాక క్రికెట్ ని ఇష్టపడని వారు ఉండరు. క్రికెటర్ లో ఏ దేశం ఆటగాళ్లను అయినా ఆదరించగల వారు అభిమానులు. అయితే పాకిస్థాన్ క్రికెట్‌లో గత రెండేళ్లుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు బాబర్ అజామ్. వన్డే, టెస్టులతో పాటు టీ20ల్లోనూ నిలకడగా రాణిస్తున్న ఈ 25 ఏళ్ల బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీని తలపిస్తున్నాడు. దాంతో ఆ దేశ అభిమానులు బాబర్ అజామ్‌ని ముద్దుగా పాక్ విరాట్ కోహ్లీగా అభివర్ణిస్తున్నారన్నా విషయం తెలిసిందే.

 

 

అయితే 2015లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బాబర్ అజామ్.. 26 టెస్టుల్లో 45.12 సగటుతో 1,850 పరుగులు చేశారు. ఇందులో 5 సెంచరీలు.. 13 హాఫ్ సెంచరీలు చేశారు. అలానే ఆడిన 74 వన్డేల్లో 54.18 సగటుతో 3,359 పరుగులు చేసిన బాబర్. 11 శతకాలు, 15 అర్ధశతకాలు నమోదు చేశారు. ఇక 38 టీ20లు ఆడిన బాబర్.. 50.72 సగటుతో 1,471 పరుగులు చేశారు. ఇందులో ఏకంగా 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయని తెలిపారు. అయితే మొత్తంగా మూడు ఫార్మాట్లలోనూ కోహ్లీ తర్వాత అత్యంత నిలకడగా రాణిస్తున్న క్రికెటర్ బాబర్ మాత్రమేనని పాక్ క్రికెటర్ల వాదన తెలియజేశారు.

 

 

అయితే వన్డే, టెస్టులు ఓకే కానీ టీ20ల్లో మాత్రం బాబర్ అజామ్ సుదీర్ఘకాలం ఆడలేడని పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది అభిప్రాయపడ్డాడు. నా అంచనా ప్రకారం టీ20ల్లో బాబర్ అజామ్ ఎక్కువ రోజులు రాణించలేడన్నాడు. వన్డే, టెస్టుల్లో మాత్రం ఆధిపత్యాన్ని ప్రదర్శించగలడని తెలిపారు. రోజు రోజుకి బాబర్ అజామ్ ఒక క్రికెటర్‌గా చాలా మెరుగవుతున్నాడని తెలిపారు.

 

 

అయితే అది కేవలం అతని హార్డ్‌వర్క్ ద్వారానే సాధ్యమవుతోందని తెలిపారు. అంతేతప్ప.. నేను ఏబీ డివిలియర్స్ లేదా విరాట్ కోహ్లీ అయిపోవాలని ఆలోచిస్తూ ఉంటే ప్రయోజనం ఉండదన్నారు. లక్ష్యాల్ని పెట్టుకుని.. దానికి తగినట్లు కష్టపడాలని యువ క్రికెటర్లకి అఫ్రిది సూచించారు. ఇటీవల పాకిస్థాన్ వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతల్ని బాబర్ చేపట్టిన విషయం అందరికి విదితమే.

మరింత సమాచారం తెలుసుకోండి: