సెప్టెంబర్ నెలలో ఐపీఎల్ 2020 సీజన్ ను అడ్డుకునేందుకు ఆసియా కప్ ని నిర్వహించాలని ప్రయత్నాలు చేసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ కి ఊహించని షాక్ ఎదురయింది. ఇటీవల ఇంస్టాగ్రామ్ లైవ్ లో బిసిసిఐ అధ్యక్షుడు  సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ ఉన్న తరుణంలో ఆసియా కప్, ట్వంటీ-20 టోర్నీ గురించి ఒక ప్రశ్న ఎదురయ్యింది. దీనితో షెడ్యూల్ ప్రకారం ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో జరగవలసిన ఆసియా కప్ రద్దయింది అంటూ గంగూలీ సమాధానం ఇచ్చాడు. ఇక నిజానికి ఈ సంవత్సరం ఆసియా కప్ ఆదిత్య హక్కులు పాకిస్తాన్ వద్ద ఉండగా ఆ దేశం నిర్వహించడం రద్దయినట్లు బీసీసీఐ అధ్యక్షుడు అయిన సౌరవ్ గంగూలీ తెలియజేయడంతో పిసిబి కి షాక్ ఎదురయ్యింది. 

 


ఇక సౌరవ్ గంగూలీ చేసిన వాక్యాలను ఆసియాకప్ ప్రకటనని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఖండించ లేకపోయింది.  ఇందుకు ముఖ్య కారణం ఏమిటన్న విషయానికి వస్తే... ఆసియా క్రికెట్ కౌన్సిల్ లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చర్చలు జరిపి వచ్చే సంవత్సరం నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడమే.  ఇదిలా ఉండగా ఐపీఎల్ 2020 బిసిసిఐ ని ఇబ్బంది పెట్టే లాగా ఉద్దేశంతో ఆసియాకప్ ఎలాంటి ప్రకటన కూడా విడుదల చేయలేదు. కానీ, సౌరవ్ గంగూలీ మాట్లాడిన మాటలతో తప్పనిసరిగా ఆసియా కప్ ఈ సంవత్సరం పూర్తిగా రద్దయినట్లు వెంటనే పిసిబి ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. 

 

 

దీంతో ఆసియా కప్ ను వచ్చే సంవత్సరానికి వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కరోనా వైరస్ తరుణంలో ఆదిత్య హక్కులను కూడా మేము శ్రీలంక కి బదిలీ చేస్తాం... ఇలా చేసేందుకు ముఖ్య కారణం ఏమిటంటే  దక్షిణ ఆసియాలో అత్యంత తక్కువగా కరోనా కేసులు నమోదైన దేశం కేవలం శ్రీలంక మాత్రమే. నిజానికి మొదట పిసిబి ఆతిధ్యం ఇస్తామనుకున్నాము. కానీ, పాకిస్తాన్ తో పాటు యూఏఈ లోనూ కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉండటంతో... శ్రీలంకకు ఆదిత్య హక్కులను మార్చుకోవాలని వచ్చిందని అర్థమవుతుంది. ఇకపోతే మళ్లీ పాకిస్తాన్ 2022లో కూడా ఆసియా కప్ కి ఆదిత్య మిస్తుంది. ఈ విషయాన్నీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ అయినా చీఫ్ ఇషాన్ మణి  స్పష్టంగా తెలియజేశాడు

మరింత సమాచారం తెలుసుకోండి: