సౌతాంఫ్టన్ వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న మొదటి టెస్టులో ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 204 పరుగులకే కుప్పకూలింది. విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ ,ఇంగ్లాండ్ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. ఓవర్ నైట్ స్కోరు 35/1తో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లాండ్ 52పరుగుల వ్యవధిలో మరో నాలుగు కీలక వికెట్లను కోల్పోయింది. ఈదశలో కెప్టెన్ బెన్ స్టోక్స్, వైస్ కెప్టెన్ జాస్ బట్లర్ ఇన్నింగ్స్ ను నిలబెట్టే ప్రయత్నం చేశారు అయితే అప్పటికే పలు సార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుండి తప్పించుకున్న స్టోక్స్ 43పరుగుల వ్యక్తి గత స్కోర్ వద్ద డౌరిచ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
 
ఆతరువాత కొద్దిసేపటికే బట్లర్ , ఆర్చర్ ,మార్క్ వుడ్  కూడా అవుట్ కాగా చివర్లో అండర్ సన్ తో కలసి ఆదుకునే ప్రయత్నం చేశాడు డామ్ బెస్ కానీ 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అండర్ సన్ అవుట్ కావడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ కు తెరపడింది. బెస్ 31 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో హోల్డర్ 6, గాబ్రియల్ 4వికెట్లు పడగొట్టారు. 
 
అనంతరం మొదటి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన వెస్టిండీస్ కు ఓపెనర్లు బ్రాత్వయిట్, క్యాంప్ బెల్ పర్వాలేదనే ఆరంభాన్నిఇచ్చారు. 43పరుగుల వద్ద క్యాంప్ బెల్(28) అండర్సన్ బౌలింగ్ లో ఎల్బీ గా వెనుదిరగడంతో విండీస్ మొదటి వికెట్ కోల్పోయింది. ఆతరువాత కాసేపటికే వెలుతురులేమి కారణంగా అంపైర్లు మ్యాచ్ ను నిలిపివేశారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ తొలి ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 57పరుగులు చేసింది. బ్రాత్వయిట్(20*),హోప్ (3*) క్రీజ్ లో వున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: