భారత క్రికెట్ లో ఎంతగానో ప్రతిభ కనబరిచి ఎన్నో విజయాలకు వారధిగా మారాడు సునీల్ గవాస్కర్. అయన 1971లో వెస్టిండీస్ పర్యటనకి భారత్ జట్టు వెళ్లింది. అప్పటికే విండీస్ సూపర్ ఫామ్‌లో ఉండటంతో.. సిరీస్‌పై ఎవరికీ అంచనాల్లేవ్. కానీ.. అరంగేట్రంలోనే ఓపెనర్‌గా ఆడిన సునీల్ గవాస్కర్ ఏకంగా నాలుగు సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ బాదేయడంతో ఒక్కసారిగా సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి పెరిగింది.

 

 

యువ బ్యాట్స్‌మెన్ నుంచి ఈ తరహాలో ఎదురుదాడి ఉంటుందని అప్పట్లో ఊహించలేకపోయిన కరీబియన్ బౌలర్లు.. తలలు పట్టుకున్నారు. అయితే మొత్తంగా ఆ సిరీస్‌లో 154.80 సగటుతో సునీల్ గవాస్కర్ 774 పరుగులు చేశాడు. భారత్ తరఫున 125 టెస్టులాడిన సునీల్ గవాస్కర్.. క్రికెట్ ప్రపంచంలో 10వేల టెస్టు పరుగుల మైలురాయిని అందుకున్న తొలి క్రికెటర్‌గా అప్పట్లో అరుదైన ఘనత సాధించిన విషయం తెలిసిందే.

 

 

వాస్తవానికి 1987లో అంతర్జాతీయ క్రికెట్‌కి సునీల్ గవాస్కర్ రిటైర్మెంట్ ప్రకటించగానే.. అతని గౌరవార్థం వాంఖడే స్టేడియంలోని గార్వారె పెవిలియన్‌లో రెండు సీట్లని కేటాయించారు. కానీ.. 2011 వన్డే ప్రపంచకప్‌కి భారత్ ఆతిథ్యం ఇవ్వగా.. ఫైనల్‌‌ని వాంఖడేలో ప్లాన్ చేయడంతో.. స్టేడియంలో మార్పులు చేశారు. దాంతో అప్పట్లో ఆ రెండు సీట్లు కనుమరుగైపోగా ఎంసీఏ కూడా పట్టించుకోలేదు. కానీ తాజాగా సన్నీ పుట్టినరోజు సందర్భంగా తిరిగి ఆ రెండు సీట్లనీ అదీ ప్రెసిడెంట్స్ బాక్స్‌లో ఎంసీఏ కేటాయించింది. భారత్ తరఫున 127 టెస్టులాడిన సునీల్ గవాస్కర్ 51.12 సగటుతో 10,122 పరుగులు చేశాడు. ఇందులో 34 సెంచరీలు, 4 డబుల్ సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలూ ఉన్నాయి. ఇక 108 వన్డేలాడిన ఈ లిటిల్ మాస్టర్ 35.14 సగటుతో 3,092 పరుగులు చేశాడు. ఇందులో ఒక్క సెంచరీ మాత్రమే ఉంది. ప్రస్తుతం క్రికెట్ కామెంటేర్‌గా గవాస్కర్ కొనసాగుతున్నారు. సునిల్ గవాస్కర్ కి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు.

మరింత సమాచారం తెలుసుకోండి: