విరాట్ కోహ్లీ సహచరులైన రోహిత్ శర్మ, మహేంద్రసింగ్ ధోనీ, గౌతమ్ గంభీర్ ఐపీఎల్ లో కెప్టెన్లుగా వరుస టైటిళ్లను కొట్టేశారు. కానీ కోహ్లీ 2013 నుంచి ఇప్పటి వరకు ఐపీఎల్ టైటిల్ ని పొందలేకపోయాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ఫెయిల్యూర్ పై తన యూట్యూబ్ ఛానల్లో భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా సవివరంగా మాట్లాడాడు. ఐపీఎల్ సీజన్ ప్రారంభం నుంచి ముంబయి ఇండియన్స్ టీమ్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో నాలుగు సార్లు టైటిల్ ను గెలుపొందింది.

 

 

ఇక చెన్నై సూపర్ కింగ్స్ మూడు సార్లు టైటిల్ విజేతగా ముద్ర వేసుకుంది. భారత జట్టుకు ఒక్కసారి కూడా కెప్టెన్ గా పదవి బాధ్యతలు చేపట్టని గౌతమ్ గంభీర్ సైతం కోల్ కతా నైట్ రైడర్స్ తరఫున రెండు సార్లు విజేతగా నిలిచింది. కానీ, 2014 నుంచి ఇండియా కెప్టెన్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కి ఒక్క టైటిల్ ని కూడా సాధించలేకపోయారు. కాప్టెన్ గా విఫలమవడానికి కారణాలేంటి..? ఎందుకు టైటిల్ కొట్టలేకపోతున్నారనే విషయంపై సవివరించాడు.

 

 

‘‘విరాట్ కోహ్లీ ఐపీఎల్ ఫార్మాట్లో సక్సెస్ ఫుల్ కెప్టెన్ కాదు. అతని నాయకత్వంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) లో మెరుగైన పదర్శన కనబర్చలేకపోతోంది. గత కొన్ని సీజన్లుగా కోహ్లీ కెప్టెన్ గా ఫెయిల్ అవుతూ వస్తున్నారు. దానికి చాలా కారణాలున్నాయి. ఆర్సీబీ సరైన జట్టును ఎంపిక చేయకపోవడం. 

 

 

జట్టును పరిశీలిస్తే.. చాలా బలహీనతలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి.సరైన జట్టు ఎంపిక చేయకుండా కెప్టెన్ నుంచి అద్భుతాలు ఆశించరాదు. టీమ్ అలా ఉన్నప్పుడు ఏం చేయలేం. జట్టు లోపాల గురించి తెలుసుకుని కెప్టెన్ సరిదిద్దుకోవాలి. అప్పుడే టైటిల్ ని కొట్టగలరు’’ అంటూ ఆకాశ్ చోప్రా కోహ్లీ జట్టుకు సూచనలు అందించారు. కనీసం ఈ సారైనా కోహ్లీ న్యాయకత్వంలో ఐపీఎల్ టైటిల్ కొడుతుందా అనేది వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: