ఇంగ్లాండ్ ,వెస్టిండీస్ ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు రసకందాయంలో పడింది. డ్రా అయ్యేలా కనిపించిన ఈటెస్టును నాలుగో రోజు చివరి సెషన్ మలుపు తిప్పింది. ఓవర్నైట్ స్కోరు 15/0 తో నాలుగో రోజు బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లాండ్ ఓపెన్లర్లు.. విండీస్ బౌలర్ల ను విసిగించారు. మొదటి సెషన్ లో కేవలం 60పరుగులు మాత్రమే చేసింది ఈజోడి. అయితే లంచ్ తరువాత 72 పరుగుల వద్ద బర్న్స్ (42) అవుట్ కాగా ఆతరువాత కాసేపటికే మరో ఓపెనర్ సిబ్లే (50) అవుట్ అయ్యాడు.
 
ఇక కుదురుకుంటున్నట్లు కనిపించిన డెన్లీ(29) కూడా తొందరగానే పెవిలియన్ చేరాడు. ఈదశలో క్రాలే(76) కు జతకలిసిన కెప్టెన్ స్టోక్స్(46) ఇంగ్లాండ్ ను పటిష్టస్థితిలో నిలిపాడు అయితే 4పరుగుల వ్యవధిలో వీరిద్దరూ అవుట్ కావడంతో ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది. ఆతరువాత వెను వెంటనే మరో మూడు వికెట్లు కోల్పోయి.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 8వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది.
 
ఆర్చర్ ,మార్క్ వుడ్ క్రీజ్ లో వున్నారు. విండీస్ బౌలర్ల లో గాబ్రియేల్ 3,అల్జారీ జోసఫ్ 2,రోస్టన్ ఛేజ్ 2 వికెట్లు తీయగా కెప్టెన్ జాసన్ హోల్డర్ ఓ వికెట్ పడగొట్టాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 170 పరుగుల ఆధిక్యంలో వుంది. రేపు మిగితా రెండు వికెట్ల ను ఎంత తొందరగా తీస్తే విండీస్ కు అంతమంచిది. చివరి రోజు వర్ష సూచన కూడా లేదు.
 
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ :204/10
వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్ : 318/10 
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్  : 284/8

మరింత సమాచారం తెలుసుకోండి: