ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లందరూ ఐపీఎల్ లో ఆడేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఐపీఎల్ లో వచ్చే ఆదాయం, ఆదరణ అలా ఉంటుంది మరి. కానీ, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ మాత్రం ఆడేందుకు నిరాకరించాడట. టీమిండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తో గొడవ కారణంగా ఐపీఎల్ లో ఆడేందుకు ఆస్ట్రేలియన్ హిట్టర్ ఆండ్రూ సైమండ్స్ 2009 సీజన్ లోనే నిరాకరించాడని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీం మాజీ సీఈఓ నీల్ మాక్స్ వెల్ తాజాగా వెల్లడించాడు.

 

 

2008లో ఆస్ట్రేలియాలో జరిగిన సిడ్నీ టెస్టుకు భారత జట్టు వెళ్లినప్పుడు అక్కడ ఆండ్రూ సైమండ్స్ ను చూసి హర్భజన్ కోతితో పోల్చి ‘మంకీగేట్’ అనే వివాదానికి తెరలేపాడన్నారు. దీంతో హర్భజన్ కు జట్టు నుంచి నిషేధించగా.. భారత క్రికెటర్లు శిక్షను ఎత్తివేయకపోతే సిరీస్ ను బహిష్కరిస్తామని హెచ్చరించారని చెప్పారు. 

 

 

ఐపీఎల్ సీజన్ 2008లో ప్రారంభమవగా.. ఆండ్రూని అప్పట్లో రూ.5.4 కోట్లకి దక్కన్ ఛార్జర్స్ దక్కించుకుంది. ధోని తర్వాత అత్యధిక ధర పలికింది సైమండ్స్ కే కానీ హర్భజన్ తో గొడవ కారణంగా తాను ఐపీఎల్ ఆడనని చెప్పారని, న్యూజిలాండ్ క్రికెటర్లని ఐపీఎల్ లో ఆడేలా ఒప్పించే బాధ్యతను ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోడీ అప్పగించారిని చెప్పుకొచ్చారు. ఒప్పించడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చినట్లు నీల్ మక్స్ వెల్ అన్నారు.

 


న్యూజిలాండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లు ఐపీఎల్ ఆడేలా ఒప్పించాలని లలిత్ మోడీ నన్ను కోరారు. ఆండ్రూ సైమండ్స్ విషయంలో నేను ఎక్కవగా శ్రమించాను. భజ్జీతో గొడవ వల్ల అతను ఐపీఎల్ ఆడేందుకు నిరాకరించినప్పుడు ఐపీఎల్ కాంట్రాక్ట్, అందులో వచ్చే ఆదాయం, ఆడాల్సిన రోజుల గురించి వివరించినప్పుడు అతను మ్యాచ్ ఆడేందుకు ఒప్పుకున్నాడు.’’ దక్కన్ ఛార్జర్స్ తరఫున 2018-10 వరకు ఆడి ఆ తర్వాత 2011లో హర్భజన్ సింగ్ తో కలిసి ముంబయి ఇండియన్స్ టీంలో కలిసి ఆడటం గమనార్హమని ఆయన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: