సౌతాంఫ్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టెస్టులో 4వికెట్ల తేడాతో గెలుపొంది చరిత్ర సృష్టించింది వెస్టిండీస్. ఓవర్నైట్ స్కోరు 280/8తో ఐదో రోజు బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లాండ్ మరో 33 పరుగులకు మిగిలిన రెండు వికెట్లు కోల్పోయి రెండో ఇన్నింగ్స్ లో 313పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది దాంతో విండీస్ ముందు 200 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది.ఇక లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 4ఓవర్ లో ఓపెనర్ క్యాంప్ బెల్  రిటైర్ హర్ట్ గా వెనుదిరగగా ఆ తరువాత 27పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈదశలో బ్లాక్ వుడ్, రోస్టోన్ ఛేజ్ ఇన్నింగ్స్ ను నిలబెట్టారు. ఈజోడి 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో విండీస్ కు గెలుపు పై ఆశలు చిగురించాయి అయితే 100 పరుగుల వద్ద రోస్టన్ ఛేజ్ (37) అవుట్ కాగా ఆతరువాత వచ్చిన డౌరిచ్ తో బ్లాక్ వుడ్ మరో కీలక భాగస్వామ్యాన్ని  నెలకొల్పాడు.

 
ఇక 168పరుగుల వద్ద డౌరిచ్ అవుట్ అయినా కెప్టెన్ హోల్డర్ తో కలిసి బ్లాక్ వుడ్, జట్టును విజయానికి దగ్గర చేశాడు. ఈక్రమంలో 95 పరుగుల వద్ద అవుట్ అయ్యి  బ్లాక్ వుడ్ సెంచరీ చేసే అవకాశాన్నిచేజార్చుకున్నాడు. అనంతరం హోల్డర్ , క్యాంప్ బెల్ కలిసి లాంఛనాన్ని పూర్తి చేశారు. ఈవిజయంతో మూడు మ్యాచ్ ల సిరీస్ లో వెస్టిండీస్1-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. 
 
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ :204/10
వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్ : 318/10 
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్  : 313/10
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ :200/6

మరింత సమాచారం తెలుసుకోండి: