సౌతాంఫ్టన్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టెస్టులో  నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది వెస్టిండీస్. చివరి రోజు ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో విండీస్ జయకేతనం ఎగురవేసింది. ఇంగ్లాండ్ విసిరిన 200 పరుగుల లక్ష్యాన్ని 6వికెట్లు కోల్పోయి 64.2ఓవర్లలో ఛేదించింది. బ్లాక్ వుడ్ 95 పరుగులతో వీరోచిత పోరాటం చేశాడు అయితే మ్యాన్ అఫ్ ది మ్యాచ్ మాత్రం విండీస్ ఫాస్ట్ బౌలర్ గాబ్రియల్ దక్కించుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్ లో 5 రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లతో మొత్తం 9వికెట్లు తీసి గాబ్రియల్ జట్టు విజయం కీలక పాత్ర పోషించాడు వీరితోపాటు కెప్టెన్ హోల్డర్ కూడా 7వికెట్లతో రాణించాడు. 
 
ఈవిజయంతో వెస్టిండీస్, ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో పాయింట్ల ఖాతా తెరిచింది. ఈటోర్నీలో ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు ఆడిన విండీస్  రెండింట్లో ఓటమి చవిచూడగా తాజా గెలుపుతో 40 పాయింట్ల ను సాధించి పాయింట్ల పట్టికలో ప్రస్తుతం 7వస్థానంలో నిలిచింది. కాగా 360పాయింట్లతో భారత్  మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఇక ఈగెలుపుతో మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో వెస్టిండీస్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఈనెల 16నుండి ప్రారంభం కానుంది. ఈమ్యాచ్ కు ఇంగ్లాండ్ టెస్టు జట్టు రెగ్యులర్ కెప్టెన్ జో రూట్ అందుబాటులో వుండనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: