భారత వెటరన్ క్రికెటర్ అంబటి రాయుడు తండ్రిగా ప్రమోషన్ అందుకున్నాడు. తన భార్య తాజాగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని ఐపీఎల్ లోని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. గత 12 సంవత్సరాలుగా చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడుతున్న అంబటి రాయుడు, 2009 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే గత సంవత్సరం నుండి అంబటి రాయుడు క్రికెట్ పరంగా కాస్త గడ్డు కాలాన్ని గడుపుతున్నాడు. 

 

 


2018 ఐపీఎల్ సీజన్ లో ఏకంగా 602 పరుగులు సాధించిన అంబటి రాయుడు  టీమిండియా కి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే తిరిగి వచ్చాక అంబటి రాయుడు తన ప్రతిభ తగ్గట్టు నిరూపించుకున్న కానీ, భారత సెలక్టర్ల తీరు కారణంగా అతడు క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది. 2019 లో జరిగిన వన్డే ప్రపంచ కప్పుకు తనని సెలెక్ట్ చేయకపోవడంతో మనస్తాపానికి గురైన అంబటి రిటైర్మెంట్ ను ప్రకటించాడు. కాకపోతే ఆ విషయంలో బండి కాస్త వెనక్కి తగ్గి రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకున్నాడు. 

 


ఆ తర్వాత రంజీ మ్యాచ్ లో హైదరాబాద్ తరఫున ఆడటం మొదలు పెట్టాడు. అక్కడ కూడా రాజకీయాలు ఎక్కువగా జరుగుతున్నాయని తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కు రాయుడు ఫిర్యాదు అందించారు. ఏదేమైనా ఇన్ని గొడవల మధ్య తనకు పాప జన్మించడం నిజంగా కాస్త ఆనందాన్ని కలిగించే విషయం రాయుడికి.

మరింత సమాచారం తెలుసుకోండి: