ఇంగ్లాండ్ దేశంలోని అగాస్ బౌల్ స్టేడియం లో నిర్వహించిన సౌథాంప్టన్ టెస్ట్ సిరీస్ లో మొదటి టెస్ట్ మ్యాచ్ నిన్న రాత్రి అనగా ఆదివారం రాత్రి పూర్తయింది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో వెస్టిండీస్ గెలిచి సంచలనం సృష్టించింది. ఇంగ్లాండ్ 204 & 313 పరుగులు చేయగా వెస్టిండీస్ 318 & 200/6 పరుగులు తీసి ఇంగ్లాండ్ దేశాన్ని వాళ్ళ  సొంతగడ్డపై ఓడించింది.

ఇంగ్లాండ్ పై గెలవాలంటే సరిగ్గా రెండు వందల పరుగులు చేయాల్సి ఉండగా... బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ ఇంగ్లాండ్ బౌలింగ్ కి తడబడింది. కేవలం 27 పరుగులకే మూడు వికెట్లు ఫటాఫట్ పడిపోయాయి. 


వెస్టిండీస్ టీం లోని మంచి బ్యాట్ మెన్స్ అందరూ సింగిల్ డిజిట్ పరుగులకే పరిమితమయ్యారు. దీంతో వెస్టిండీస్ అభిమానులంతా తీవ్ర నిరాశలో మునిగి పోయారు. అప్పుడే ఓ ఆశాకిరణంగా క్రీజులోకి అడుగుపెట్టిన మిడిల్ ఆర్డర్ ప్లేయర్ జెర్మైన్ బ్లాక్‌వుడ్ ఇంగ్లాండ్ బౌలింగ్ కి బ్యాట్ తో సమాధానం చెప్తూ 154 బంతుల్లో 95 పరుగులు చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి వెస్టిండీస్ ని విజయ తీరాల వైపు నడిపించి కేవలం ఒక్క రాత్రిలోనే స్టార్ బ్యాట్ మ్యాన్ గా పేరు సంపాదించాడు. నిజానికి 200 పరుగుల లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ తన చరిత్రలో ఏ రోజు ఓడిపోలేదు. జెర్మైన్ బ్లాక్‌వుడ్ కారణంగా నిన్న కూడా అదే జరిగింది. 


జెర్మైన్ బ్లాక్‌వుడ్ ఇంగ్లాండ్ బౌలింగ్ కి దీటుగా నిలబడి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతను తనకి జోడీగా ఆడుతున్న కెప్టెన్ జేసన్ హోల్డర్‌తో మాట్లాడుతూ సలహాలు తీసుకున్నాడు. నిజానికి వెస్టిండీస్ క్రికెట్ ఆటగాళ్లందరూ ఆరు అడుగుల హైట్ కలిగి ఉంటారు. కానీ జెర్మైన్ బ్లాక్‌వుడ్ మాత్రం అందుకు భిన్నంగా చాలా ఎత్తు తక్కువగా ఉంటాడు. దీంతో అతను కెప్టెన్ జేసన్ హోల్డర్‌ వద్దకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు చాలా చిన్న పిల్లాడి లాగా కనిపించాడు.

దీంతో ప్రేక్షకులు వీళ్ళిద్దరూ భలే ఉన్నారు అనుకుంటూ తెగ జోకులు వేసుకోవడం ప్రారంభించారు. ట్విట్టర్ వేదికగా నెటిజన్లు కూడా అనేక జోకులు పేల్చారు. ప్రస్తుతం అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: