వివాదాలకు దూరంగా ఉంటాడు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్స్. ప్రత్యర్థి ఆటగాళ్లు నిప్పులు కురిపిస్తున్నా.. వారితో సౌమ్యంగా మెరిగే విలియమ్స్ క్రికెట్ కోచ్ గ్యారీతో గొడవపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. న్యూజిలాండ్ కెప్టెన్సీ నుంచి కేన్ విలియమ్స్ ను తొలగిస్తున్నట్లు గత కొద్ది రోజులుగా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

 

 

ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్టు సిరీస్ లలో 0-3 తేడాతో న్యూజిలాండ్  చేజార్చుకుంది. దీంతో జట్టు కోచ్ గ్యారీకి కెప్టెన్ విలియమ్స్ కు మధ్య మనస్పర్థలు వచ్చాయని తెలుస్తోంది. ఇద్దరి మధ్యల గొడలు రావడంతో గ్యారీ విలియమ్స్ ను కెప్టెన్సీ నుంచి తొలగించేందుకు పన్నాగాలు పన్నడం మొదలు పెట్టినట్లు సమాచారం. న్యూజిలాండ్ జట్టు కెప్టెన్సీ నుంచి విలియమ్స్ ను తప్పించి అతడి స్థానంలో టామ్ లాథమ్ కు పగ్గాలను అప్పగించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇవన్నీ పుకర్లకే పరిమితమని తాజాగా గ్యారీ ఒక ప్రకటనలో స్పష్టం చేశాడు.

 

 

గ్యారీ మాట్లాడుతూ.. కెప్టెన్ కేన్ విలియమ్స్ ను పదవి నుంచి తొలగిస్తున్నామని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, కెప్టెన్ ను నియమించాలని అస్సలు ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. కెప్టెన్ విలియమ్స్ ఓ మంచి ప్లేయర్ తో పాటు గొప్ప నాయకుడు. అతని ఆధ్వర్యంలో మరికొన్ని రోజులు న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కొనసాగుతుంది. ఇక మా మధ్య అభిప్రాయ భేదాలంటారా.. టీం అన్నాక గొడవలు సహజం, మనస్పర్థలు వస్తూ ఉంటాయని గ్యారీ వివరణ ఇచ్చాడు.

 

 

ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్టుల్లోనూ ఏకంగా 200 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓడిపోవడం అప్పట్లో దుమారం రేపింది. కేన్ విలియమ్స్ కెప్టెన్సీ పై అప్పట్లో చాలా విమర్శలు చోటు చేసుకున్నాయి. కానీ 2016లో కెప్టెన్ గా బాధ్యతు చేపట్టిన విలియమ్స్ వివాదాలకు దూరంగా ఉంటాడని అతనికి మంచి పేరుంది. టీం సభ్యులే కాదు.. ప్రత్యర్థి టీం క్రికెటర్లు కూడా అతడిని ఇష్టపడతారు. దీనికి ఉదాహరణగా చెప్పాలంటే కోహ్లీతో గత దశబ్దకాలంగా వీరిద్దరి మధ్య కొనసాగుతున్న స్నేహమే నిదర్శనం.

మరింత సమాచారం తెలుసుకోండి: