గత నాలుగు నెలలుగా కరోనా వల్ల అంతర్జాతీయ క్రికెట్ స్థంభించిపోగా.. కొద్దిరోజుల క్రితం ఇంగ్లాండ్- వెస్టిండీస్ లమధ్య జరిగిన మొదటి టెస్టుతో తిరిగి ప్రారంభమైంది. ఈనేపథ్యంలో ఐసీసీ తాజాగా టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. ఇందులో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమ్మిన్స్ 904పాయింట్ల తో మొదటి స్థానాన్ని నిలుపుకోగా 862 పాయింట్ల తో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ నీల్ వాగ్నర్ ను వెనక్కు నెట్టి వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ రెండో స్థానంలో నిలిచాడు.
 
ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టెస్టులో హోల్డర్ 7వికెట్ల తో సత్తాచాటడంతో కెరీర్ బెస్ట్ ర్యాంక్ ను సొంతం చేసుకున్నాడు. ఇక మొదటి టెస్టులో పెద్దగా ప్రభావం చూపకపోడవంతో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ రెండు  స్థానాలు దిగజారి 10వ ర్యాంక్ లో నిలిచాడు. కాగా ఈజాబితాలో టీంఇండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 779పాయింట్లతో 7వస్థానంలో కొనసాగుతున్నాడు. 
 
ఇక గురువారం నుండి ఇంగ్లాండ్ - వెస్టిండీస్ లమధ్య మాంచెస్టర్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈటెస్టులో గెలిచి ఇంగ్లాండ్ మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను 1-1తో సమం చేయాలనే పట్టుదలతో వుంది. మొదటి టెస్టుకు దూరమైన కెప్టెన్ జో రూట్ రెండో టెస్టుకు అందుబాటులో వుండనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: