ప్రతి సంవత్సరం భారతదేశంలో జరిగే ఐపీఎల్ సీజన్ లాగే, ఆస్ట్రేలియాలో కూడా ప్రతి సంవత్సరం బిగ్ బాష్ టి20 లీగ్ జరుగుతోంది. అయితే తాజాగా కరోనా వైరస్ నేపథ్యంలో అక్టోబర్ 18 నుండి నవంబర్ 16 వరకు జరగాల్సిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ జరుగుతుందో జరగదో అన్న విషయం స్పష్టత రాకపోయినా, బిగ్ బాష్ టి20 లీగ్ షెడ్యూల్ ని మాత్రం పక్కా ప్రణాళికతో విడుదల చేసింది. ఇక ఈ సీజన్ డిసెంబర్ 3 నుండి మొదలై 2021 జనవరి 26 వరకు లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. ఆ తర్వాత ఎలిమినేటర్, రన్నర్, విన్నర్ లకు సంబంధించి మ్యాచ్ లను జరపనున్నారు.

 

 

మరోవైపు మన దేశంలో మార్చ్ 29 నుంచి మొదలు అవ్వాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేస్తూ వస్తోంది. ఒకవేళ ఐసిసి వరల్డ్ కప్ వాయిదా పడితే ఆ సమయంలో ఐపీఎల్ సీజన్ ను  నిర్వహించాలని బీసీసీఐ సమాలోచనలు చేస్తోంది. 


ఈ నేపథ్యంలో టి20 ప్రపంచ కప్ వాయిదా నిర్ణయం కోసం బీసీసీఐ మూడు నెలలుగా ఎదురుచూస్తున్నా, కానీ... ఐసీసీ మాత్రం బీసీసీఐని ఇరుక పడేసేందుకు టీ20 ప్రపంచకప్ నిర్ణయంపై ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తోంది. బీసీసీఐ ఐపీఎల్ జరపడానికి గందరగోళంలో పడిపోగా మరోవైపు ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్ వారి క్రికెట్ బోర్డులు ఇప్పటికే వారి దేశాల్లో జరగాల్సిన ప్రవేట్ టి20 షెడ్యూల్ ను ప్రకటించారు కూడా. వెస్టిండీస్ లో జరగబోయే కరేబియన్ ప్రీమియర్ లీగ్ కూడా ఆగస్టు 18 నుండి మొదలుకానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: