మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా సౌతాంఫ్టన్ లో జరిగిన మొదటి టెస్టులో ఇంగ్లాండ్ పై వెస్టిండీస్ విజయం సాధించి 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు రేపటి నుండి మాంచెస్టర్ లో జరుగనుంది. ఈటెస్టులో గెలిచి సిరీస్ ను సమం చేయాలని ఇంగ్లాండ్ భావిస్తుండగా.. ఈటెస్టు ను కూడా గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోని చరిత్ర సృష్టించాలని విండీస్ పట్టుదలతో వుంది. వెస్టిండీస్, మొదటి టెస్టుతో బరిలోకి దిగిన జట్టునే రెండో టెస్టులో కొనసాగించనుండగా ఇంగ్లాండ్ మాత్రం మూడు మార్పులు చేయనుంది. 
 
అందులో భాగంగా రెండో టెస్టు కోసం 13మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది ఈసీబీ. మొదటి టెస్టు లో దారుణంగా విఫలమైన జాయ్ డెన్లీ పై వేటు వేయగా అతని స్థానంలో కెప్టెన్ రూట్ జట్టులోకి వచ్చాడు కాగా మొదటి టెస్టు కు వ్యక్తిగత కారణాలతో రూట్ దూరమైన సంగతి తెలిసిందే అలాగే ఫాస్ట్ బౌలర్లు  జేమ్స్ అండర్సన్ ,మార్క్ వుడ్ లకు రెండో టెస్టుకు విశ్రాంతి నివ్వగా రాబిన్సన్ ,సామ్ కర్రాన్ లకు చోటు దక్కింది అయితే వోక్స్ కూడా ఉండడంతో వీరిద్దరికి తుది జట్టులో స్థానం దక్కకపోవచ్చు. ఇక మొదటి టెస్టులో తుది జట్టులో చోటు కోల్పోయిన బ్రాడ్ కు ఈసారి చోటు ఖాయం. భారత కాలమాన ప్రకారం రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు ఈమ్యాచ్ ప్రారంభంకానుండగా సోనీ సిక్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. 
 
ఇంగ్లాండ్ : రూట్ (కెప్టెన్),స్టోక్స్( వైస్ కెప్టెన్), బట్లర్ ( కీపర్), బ్రాడ్  ,ఆర్చర్, రాబిన్సన్ ,సామ్ కర్రాన్ , రోరీ బర్న్స్ ,ఓల్లి పోప్ , సిబ్లే , జాక్ క్రాలే,  డామ్ బెస్, వోక్స్

మరింత సమాచారం తెలుసుకోండి: