కరోనా వైరస్ మరోసారి భారతదేశ క్రికెట్ అభిమానులకు దెబ్బ వేసింది. టీమిండియా జట్టు ఎప్పుడు నుంచి క్రికెట్ ఆడుతుందో అని ఎంతగానో ఎదురు చూసిన అభిమానులకు నిరాశే మిగిలింది. అతి త్వరలో జరగనున్న ఇంగ్లాండ్, టీమిండియా జట్ల మధ్య జరగనున్న పరిమిత ఓవర్ల క్రికెట్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా మూడు టి20 లు, మూడు వన్డేలు ఆడాల్సిన ఇంగ్లాండ్ జట్టు పర్యటన ఇకపై జరిగేటట్లు కనపడట్లేదు.

IHG's probable <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=2020' target='_blank' title='2020-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>2020</a> schedule


దీనికి కారణం భారతదేశంలో కరోనా వైరస్ ప్రస్తుతం ఏ విధంగా తీవ్ర రూపం దాలుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్ తో పాటు సెప్టెంబర్ నెలలో జరగబోయే న్యూజిలాండ్ ఏ పర్యటన కూడా వాయిదా పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయాలను బిసిసిఐకి సంబంధించిన ఓ అధికారి స్పష్టంగా తెలియజేశారు.

IHG will not travel to <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SRI LANKA' target='_blank' title='sri lanka-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>sri lanka</a> and Zimbabwe, says BCCI

 

ప్రస్తుతం దేశంలో కరోనా నేపథ్యంలో ఎలాంటి క్రీడా సంబరాలు జరగట్లేదన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రేక్షకులు లేకుండానే స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుపుకోవచ్చని చెప్పిన, నానాటికి పరిస్థితులు దేశంలో అనుకూలించడం లేదు.

IHG


ఈ నేపథ్యంలోనే మార్చి నెలలో మొదలవ్వాల్సి న ఐపీఎల్ 2020 సీజన్ కూడా వాయిదా పడటంతో క్రికెట్ అభిమానులు నిరాశకు గురయ్యారు. దీంతో ఎప్పుడెప్పుడు టీమిండియా ఆటగాళ్లు గ్రౌండ్ లో దిగి ప్రేక్షకులను అలరిస్తారన్నట్లు వేచి చూస్తున్నారు. ఇకపోతే శుక్రవారం నాడు బీసీసీఐ జరిపే సమావేశంలో ఈ రెండు సిరీస్ లపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఐపీఎల్ 2020 సీజన్ కూడా ఇక్కడ నిర్వహించాలన్న విషయంపై కూడా చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: