ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్‌ ఆడుతుండగా నిద్రిస్తున్న సహచరుడి ప్రియారాలిపై అత్యాచారం చేసిన ఆస్ట్రేలియన్‌ యువ క్రికెటర్‌కు ఇంగ్లండ్‌ కోర్టు ఐదేళ్ల శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే.. 2017లో ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్‌ హెప్‌బర్న్‌(23) వార్చెస్టెర్‌షేర్‌ కౌంటీ క్రికెట్ క్లబ్‌ తరపున ఆడుతున్నాడు. ఓ రోజు తన సహచర ఆటగాడు జో క్లార్క్‌ ఓ అమ్మాయిని తన గదికి తీసుకువచ్చాడు. ఆమె నిద్రిస్తున్న సమయంలో అలెక్స్‌ ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.


కాగా, ఈ  కేసు హెర్ఫోర్డ్‌ క్రౌన్‌ కోర్టులో రెండేళ్లుగా విచారణ జరుగుతోంది.  ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని వివరించే సందర్భంలో ఆమె ఎలాంటి అసత్యాలూ పలకలేదని కోర్టు గుర్తించింది. ఆ క్రమంలో అలెక్ట్స్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నాడని తేల్చింది. వైద్య పరీక్షల్లో కూడా అతను నేరం చేసినట్లు రుజువైంది. హెర్ఫోర్డ్ క్రౌన్ కోర్టు అతనికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇక హెబ్ బర్న్ క్రికెట్ కెరీర్ ముగిసినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: