వరల్డ్ కప్ సంగ్రామంలో ఇండియా తొలి మ్యాచ్ ఈరోజు ఆడబోతున్నది.  వరల్డ్ కప్ లో ఫెవరెట్ జట్లలో ఒకటైన సౌత్ ఆఫ్రికాతో ఈరోజు తలబడబోతున్నది.  సౌత్ ఆఫ్రికా ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఆడింది.  రెండు మ్యాచ్ లలోను ఓటమి పాలైంది.  మొదటి మ్యాచ్ ఇంగ్లాండ్ తో, రెండో మ్యాచ్ పసికూనలు బాంగ్లాదేశ్ తో ఓడిపోయి కసితో ఉన్నది.  ఆ కసిని ఇండియాపై గెలిచి తీర్చుకోవాలని చూస్తోంది.  


సౌత్ ఆఫ్రికాకు ఆ అవకాశం ఇవ్వకూడదని ఇండియా ప్లాన్ చేస్తోంది.  ఎలాగైనా ఫస్ట్ మ్యాచ్ లో విజయం సాధించి టైటిల్ ఫెవరేట్ జట్టుగా నిలవాలని చూస్తోంది.  ఎవరు గెలుస్తారు అనే విషయం ఈరోజు సాయంత్రానికి తేలిపోతుంది.  ఇదిలా ఉంచితే... ఇప్పటి వరకు జరిగిన 11 వరల్డ్ కప్ మ్యాచ్ లలో ఇండియా 6 సార్లు మొదటి మ్యాచ్ ఓడిపోయింది.  ఐదు సార్లు గెలిచింది. 


మొదటిమ్యాచ్ గెలిచిన ఐదుసార్లలో రెండు సార్లు కప్ గెలుచుకుంది.  1983లో జరిగిన వరల్డ్ కప్ లో ఇండియా మొదటి మ్యాచ్ వెస్ట్ ఇండీస్ తో తలపడింది. ఆ మ్యాచ్ లో ఇండియా 60 ఓవర్లలో 262 పరుగులు చేయగా, వెస్ట్ ఇండీస్ కేవలం 228 పరుగులు మాత్రమే చేయగలిగింది.  ఫైనల్ మ్యాచ్ లో ఈ రెండు జట్లే తలపడ్డాయి.  


2011 లో జరిగిన వరల్డ్ కప్ విషయానికి వస్తే.. మొదటిమ్యాచ్ బాంగ్లాదేశ్ తో జరిగింది.  ఈ మ్యాచ్ లో బాంగ్లాదేశ్ పై ఇండియా 87 పరుగుల తేడాతో విజయం సాధించింది.  ఈ మ్యాచ్ లో సెహ్వాగ్, కోహ్లీలు సెంచరీ చేశారు.  ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంకపై విజయం సాధించి కప్ గెలుచుకుంది.  ఈరోజు జరిగే మ్యాచ్ లో ఇండియా గెలుస్తుందా చూద్దాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: