ఒకప్పుడు ఈ జట్టు పసికూనలు.. ఇప్పుడు టాప్ జట్లకు ముచ్చెమటలు పట్టిస్తున్న టైగర్లు.   నిన్న జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు బాంగ్లాదేశ్ పై 106 పరుగుల తేడాతో విజయం సాధించింది.  ఈ వరల్డ్ కప్ లో ఇదే భారీ విజయం.  మొదట బ్యాటింగ్ చేసింది ఇంగ్లాండ్ జట్టు 50 ఓవర్లలో 386 పరుగులు చేసింది.  


జేసన్ రాయ్ సెంచరీతో రాణించగా.. బట్లర్ మెరుపులతో అర్ధ సెంచరీ చేశాడు.  మిగతా బ్యాట్స్మెన్స్ లు తమ వంతు సహకారం అందించడంతో ఇంగ్లాండ్ జట్టు 386 పరుగులు చేసింది.  ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బాంగ్లాదేశ్ ఆరంభంలో భారీ స్కోర్ దిశగా ఆడటం మొదలుపెట్టింది.  


అయితే, హాకిబుల్ హాసన్ సెంచరీసాధించాడు.  రషీమ్ అతనికి కొంతమేర సహకరించాడు.  కానీ, లక్ష్యం పెద్దగా ఉండటంతో పాటు మిగతా బ్యాట్స్ మెన్ల సహకారం లేకపోవడంతో కెలవం 280 పరుగులు మాత్రమే చేయగలిగింది.  హకీమ్ క్రీజ్ లో ఉన్నంత సేపు ఖచ్చితంగా గెలుస్తారనే నమ్మకం ఉన్నది.  


ఒక బెస్ట్ జట్టులా బాంగ్లాదేశ్ పోరాటం చేయడం విశేషం.  క్రికెట్ కు పుట్టినిల్లు వంటిదైన ఇంగ్లాండ్ కు ఇప్పటి వరకు ఒక్క వరల్డ్ కప్ కూడా గెలుచుకోలేక పోయింది.  హాట్ ఫెవరెట్ జట్లలో ఒకటిగా ఉన్న ఇంగ్లాండ్ ఈసారైనా కప్పు సాధిస్తుందా చూద్దాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: