గురువారం  యాషెస్ సిరీస్  తొలి టెస్ట్ ప్రారంభం కాగా మొదటి రోజు నుండే ఇంగ్లాండ్  అభిమానులు  డేవిడ్ వార్నర్ ,బ్యాన్ క్రాఫ్ట్ , స్టీవెన్  స్మిత్ లను అవమానిస్తూ రచ్చ చేసారు. చీటర్ చీటర్ అంటూ అరుస్తూ వారికీ సాండ్ పేపర్లు చూపిస్తూ  హేళన చేశారు. అయితే స్మిత్ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అద్భుతమైన సెంచరీ చేసి  వారికీ బ్యాట్ తో సమాధానం చెప్పాడు.  కాగా ఇంగ్లాండ్ అభిమానులు సెల్డ్జింగ్  ఒక్క  రోజుకే పరిమితం కాలేదు  మూడో రోజూ కూడా కొనసాగింది.మూడో రోజు బౌండరీ లైన్ దగ్గర వార్నర్  ఫీల్డింగ్ చేస్తుండగా కొందరు ఇంగ్లాండ్ ఫ్యాన్స్  స్లెడ్జింగ్ చేసారు.  వార్నర్ సాండ్ పేపర్ తీసుకొచ్చావా అని అరుస్తూ  హంగామా చేయగా  దానికి బదులుగా వార్నర్  తన రెండు జేబులను చూపిస్తూ  నా జేబుల్లో ఏమి లేదని సమాధానం ఇచ్చాడు. అయితే అంతగా  స్లెడ్జింగ్ చేస్తున్నా ..   వార్నర్ నవ్వుతూ వారికీ  సమాధానం  ఇచ్చాడు. ప్రస్తుతం దానికి  సంబందించిన  ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.  కాగా ఇంగ్లాండ్  అభిమానుల ఓవర్ యాక్షన్ రోజు రోజుకి ఎక్కువ అవుతుందని నెటిజన్లు  మండిపడుతున్నారు. 

ఇక ఇంగ్లాండ్ , ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్  రసవత్తరంగా మారింది. మొదటి ఇన్నింగ్స్ లో  ఆసీస్ 284 పరుగులు  చేసి అల్ అవుట్ అవ్వగా తరువాత బ్యాటింగ్ ఆరంబించిన  ఇంగ్లాండ్  374 పరుగులు వద్ద తమ మొదటి ఇన్నింగ్స్ ను ముగించింది. దాంతో  ఇంగ్లాండ్ కు 90 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక ఆతరువాత సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ మూడో రోజు అటముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. 


మరో సారి ఆసీస్ ఓపెనర్లు విఫలం అవ్వగా  ఖవాజా తో కలిసి  స్మిత్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు.  ఈక్రమంలో  40 పర్గుగుల వ్యక్తి గత స్కోర్ వద్ద  స్టోక్స్ బౌలింగ్ లో ఖవాజా  అవుట్ కావడం తో  క్రీజ్ లోకి  వచ్చిన ట్రెవిస్ హెడ్ , స్మిత్ తో కలిసి  మరో వికెట్  పడకుండా ఆచి తూచి ఆడాడు. ప్రస్తుతం స్మిత్ 46,హెడ్ 21 పరుగులతో క్రీజ్ లో వున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: