భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ ) అధ్యక్షుడి గా పదవి బాధ్యతలు చేపట్టబోతున్న సౌరవ్ గంగూలీ త్వరలోనే బీజేపీ లో చేరబోతున్నట్లు జోరుగా  ఊహాగానాలు విన్పిస్తున్నాయి . ఈ నేపధ్యం లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో, గంగూలీ భేటీ కావడం తో ఈ ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి . అయితే బీజేపీ లో చేరనున్నారన్న ఊహాగానాలపై   గంగూలీ స్పందిస్తూ అమిత్ షా తో భేటీ లో  ఎటువంటి రాజకీయ చర్చలు జరగలేదని చెప్పాడు . అమిత్ షా ను తొలిసారిగా కలిసినట్లు వివరించాడు .


 గంగూలీ , బీజేపీ లో చేరేందుకు రంగమంతా  సిద్ధమైందని , రానున్న ఎన్నికల్లో ఆయన్ని  పశ్చిమ బెంగాల్ బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది . అయితే    ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ క్రికెట్ సంఘం (సి ఏ బి ) అధ్యక్షుడిగా గంగూలీ కొనసాగుతున్నాడు .  క్యాబ్ అధ్యక్షుడిగా కొనసాగుతోన్న గంగూలీ కి  , తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ తో మంచి  సంబంధాలే ఉన్నాయి .క్యాబ్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి మమతా బెనర్జీ ఎంతో సహకరించింది . 


  గంగూలీ బీజేపీ లో చేరబోతున్నాడన్న ఊహాగానాలపై మమతాబెనర్జీ స్పందించింది . బెంగాలీలు ప్రస్తుతం గర్వించదగ్గ విషయమని మదర్ థెరిసా , అమర్త్య సెన్ , అభిజిత్ బెనర్జీ లకు నోబెల్ బహుమతి రావడం , జగన్ మోహన్ దాల్మియా తరువాత గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు కావడం ఆనందంగా ఉందని చెప్పింది .   గంగూలీ తమవాడని , అతనితో   నిరంతరం టచ్ లో ఉన్నామని చెప్పింది . దుర్గా పూజ కు ముందు సౌరవ్ తనని చూడటానికి వచ్చాడని , తాను కూడా సౌరవ్ తో త్వరలోనే మాట్లాడుతానని మమతా బెనర్జీ పేర్కొంది .s


మరింత సమాచారం తెలుసుకోండి: