ప్రస్తుతం రాంచిలో జరుగుతున్న దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో రోహిత్ అదరగొడుతున్నాడు. మొదటి రోజు సెంచరీ చేసి సఫారీలకు హెచ్చరికలు జారీ చేసిన రోహిత్ రెండో రోజు కూడా తనదైన శైలిలో రెచ్చిపోయాడు. రహానేతో కలిసి రికార్డు భాగస్వామ్యం కూడా నెలకొల్పాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆదిలోనే తడబడింది. పది ఓవర్ల లోపే మూడు వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడింది. ఆ సమయంలో అద్భుత బ్యాటింగ్ తో రోహిత్ సఫారీలను ఎదుర్కున్నాడు. 


కోహ్లీ వికెట్ పడ్డాక వచ్చిన రహానే రోహిత్ కు చక్కటి సహకారం అందించాడు. యాభై పరుగుల తరువాత రోహిత్ వన్డే తరహాలో సఫారీలపై రెచ్చిపోయాడు. మొదట నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ 50 పరుగుల వరకు సఫారీ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. కోహ్లీ వికెట్ పడ్డాక గేరు మార్చాడు. తనదైన శైలిలో సిక్సర్ తో సెంచరీ పూర్తి చేసాడు. చూడచక్కనైన షాట్ లతో అలరించాడు.


రాంచీలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో అజింక్యా రహానే సెంచరీ సాధించి, అవుట్ అయ్యాడు. ఓవర్ నైట్ స్కోర్ 224/3 నుంచి రెండో రోజు ఆటను ప్రారంభించిన రహానే, రోహిత్ ల జోడీ, సగటున ఓవర్ కు 4.5 పరుగుల చొప్పున సాధిస్తూ, దక్షిణాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించారు. ఈ క్రమంలో టెస్టుల్లో తన 11వ సెంచరీని పూర్తి చేసుకున్న రహానే 115 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కీపర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 


లంచ్ సమయానికి మరో ఎండ్ లో పాతుకుపోయిన రోహిత్ శర్మ ప్రస్తుతం 199 పరుగుల స్కోరు వద్ద కొనసాగుతూ, టెస్టులో మొదటి డబుల్ సెంచరీ దిశగా సాగుతున్నాడు. రహానే అవుటైన తరువాత రవీంద్ర జడేజా వచ్చి రోహిత్ కు జత కలిశాడు. ప్రస్తుతం భారత స్కోరు 85 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 357 పరుగులు సాధించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: