అంతర్జాతీయ  క్రికెట్ లో ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లు బాదడం అంటే అంతమాషి వ్యవహారమేమి కాదు . ఈ ఫిట్ సాధించిన ఘనత ఇప్పటి వరకూ భారత్ డాషింగ్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ కు మాత్రమే దక్కింది . తొలి  ప్రపంచ టి ట్వంటీ కప్ సందర్బంగా ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లు బాది ఈ అరుదైన రికార్డు తన పేరిట నమోదు చేసుకున్నాడు యువీ. యువీ రికార్డు ను సమం చేయడం అంత సులభమేమి కాకపోయినా, అసాధ్యం కూడా ఏమి కాదు .


 అందుకేనెమో యువీ రికార్డు భారత్ యాక్టింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ కన్నేశాడు . బంగ్లాదేశ్ తో జరిగిన టి ట్వంటీ మ్యాచ్ తో సందర్బంగా రోహిత్ ఈ ఫిట్ సాధిస్తాడేమోనని అందరూ అనున్నారు. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయం లో   చెలరేగి ఆడుతున్న రోహిత్ శర్మ ,  బంగ్లా ఆఫ్ స్పిన్నర్ మొసద్దిక్ హుస్సేన్ వేసిన ఇన్నింగ్స్ 10  వ ఓవర్ లో వరుసగా మూడు బంతుల్ని సిక్సర్లుగా మలిచి , ఒక్కసారిగా యువీ సాధించిన రికార్డును గుర్తుకు తెప్పించాడు . అయితే మొసద్దిక్ హుస్సేన్ నాల్గవ బంతిని తెలివిగా విసిరి రోహిత్ ను కట్టిపడేసాడు . దీనితో ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లు సాధించాలన్న రోహిత్ కోరిక నెరవేరలేదు .


 మ్యాచ్ అనంతరం ఇదే విషయంపై రోహిత్ స్పందిస్తూ మొసద్దిక్ బౌలింగ్ లో ఆరు బంతుల్ని స్టాండ్స్ లోకి పంపాలని భావించిన మాట నిజమేనని అన్నాడు . వరుసగా మూడు బంతుల్ని సిక్సర్లుగా మలచిన తరువాత , నాల్గవ బంతికి పరుగులేమి రాకపోవడం తో, ఐదవ బంతికి సింగల్ తీయాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు .


మరింత సమాచారం తెలుసుకోండి: