ప్రపంచంలో క్రికెట్ అంటే అభిమానంచే వారు చాలా మంది ఉన్నారు. అదే విధంగా క్రికెట్ క్రీడాకారులను కూడా విపరీతంగా అభిమాస్తుంటారు. గతంలో ఈ క్రిడపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ చాలా మంది క్రీడాకారులు స్వార్ధానికి లొంగి దేశం పరువు తీస్తున్నారు. ఎంతో నమ్మకంతో దేశం తరుపున ఆడే క్రీడాకారులు ఇలాంటి స్వార్ధంతో చేసే పనుల వారి భవిష్యత్ కూడా నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో మరో ఇద్దరు క్రికెటర్లపై వేటు పడింది.


ఈ కేసులో రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ అజిత్ చండీలాపై జీవితకాల నిషేధం విధిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. చండీలాతోపాటు మరో క్రికెటర్ హీకెన్ షాపై ఐదేళ్లపాటు నిషేధం విధించింది.అజిత్ చండీలాతోపాటు మరో క్రికెటర్ హీకెన్ షాపై ఐదేళ్లపాటు నిషేధం విధిస్తున్నట్టు పేర్కొంది.


అజిత్ చండీలా,శ్రీశాంత్,అంకిత్ చవాన్


2013 ఐపీఎల్ సీజన్లో అప్పటి రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్లతో పాటు చండీలాను ఫిక్సింగ్ ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీశాంత్, చవాన్లపై ఇప్పటికే బీసీసీఐ జీవితకాల నిషేధం విధించిన విషయం అందరికి తెలిసిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: