భారత దేశంలో ఎంతో ప్రతిభ నైపుణ్యం ఉన్నవాళ్లు ఆర్థిక ఇబ్బందులతో పైకి రాలేక పోతున్నారు. ఇలాంటి పేదరికం ఉన్న క్రీడాకారులు తమ నైపుణ్యం చూపించుకోలేక మారుమూల ప్రాంతాల్లోనే మగ్గిపోతున్నారు. కొంత అద్భుతమైన ప్రతిభాపాటవాలు ఉన్న ఉన్నత శిఖరాలకు చేరుకోలేకపోతున్నామన్న నిరుత్సాహంత తనువు ముగించుకుంటున్నారు. తాజాగా ఓ యువక్రీడాకారిణికి పేదరికం శాపంగా మారి చివరకు తనువు చాలించుకుంది. వివరాల్లోకి వెళితే..ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో యువ స్విమ్మర్‌ సైరా సైరోహి(16) పాఠశాల నుంచి వచ్చిన తర్వాత తన గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. అయితే ఆమె తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాల రవాణా ఫీజు రూ.45,000 కట్టలేకపోవడంతో గత కొద్దిరోజులుగా ఆమె పాఠశాలకు వెళ్లలేకపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. 16ఏళ్ల యువ స్విమ్మర్‌ సైరా ఇప్పటికి పలు పోటీల్లో దాదాపు 100 బంగారు పతకాలను సాధించింది. 2015 సంవత్సరానికి గాను వరల్డ్‌ ఆక్వాటిక్‌ ఛాంపియన్‌షిప్‌కి ఎన్నికైన ఆమె కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వాటిలో పాల్గొనలేదు.

యువ స్విమ్మర్‌ సైరా సైరోహి


గతంలో 16గంటల 38 నిమిషాల్లో దాదాపు 38 కిలోమీటర్లు ఈత కొట్టి రికార్డు కూడా నెలకొల్పింది సైరా. సైరా మృతి పట్ల స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. భవిష్యత్‌లో మనదేశానికి ప్రాతినిథ్యం వహిస్తుందనుకున్న క్రీడాకారిణి ఇలా చేయడం బాధాకరమని పేర్కొంది. స్విమ్మింగ్ క్రీడలో ఆమెకు మంచి భవిష్యత్ ఉండేదని తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: