ప్రపంచంలో క్రికెట్ అంటే అభిమానించని వారు ఎక్కడా ఉండరు..ఒకప్పడు గ్రామీన క్రీడలు కూడ పక్కనబెట్టి గ్రామస్థాయిల్లో యువకులు, పిల్లలు క్రికెట్ బ్యాట్స్ పట్టుకొని తిరుగుతున్న పరిస్థితి..ప్రపంచంలో  మారు మూల ప్రాంతాల్లో కూడా క్రికెట్ అంటే పిచ్చిగా  అభిమానించేవారి శాతం బాగా పెరిగిపోయింది. సాధారణంగా క్రికెట్ చరిత్రలో క్రీడాకారులు రక రకాల రికార్డులు నెలకొల్పడం మనం చూస్తుంటాం..అయితే అవి ఒకరిని మించి ఒకరు ఎంత ఎక్కువ సాధిస్తే అంత రికార్డుల మోత మోగుతుంది..తాజాగా  ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఆశ్చర్యం గొలిపే అంశం ఇది.

అంతే కాదు ఈ సమాచారం తెలియడంతో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) బిత్తరపోయింది.కనీసం గల్లీ క్రికెట్‌లో కూడా ఇటువంటి వింత చోటు చేసుకుని ఉండకపోవచ్చు. అలాంటి వింత ఇంగ్లాండ్‌లో చోటు చేసుకుంది. 20 బంతులు ఎదుర్కొని.. 10 వికెట్లు కోల్పోయి.. అసలు స్కోరు బోర్డు తెరువకుండానే ఆలౌటైంది. అంతకుముందు 120 పరుగులు చేసిన ప్రత్యర్థి జట్టు 120 పరుగులతో ఘనవిజయం సాధించింది.

కంటెర్‌బరీ క్రికెట్ మైదానంలో బాప్‌చైల్డ్‌ జట్టు, క్రైస్ట్ చర్చ్ యూనివర్సిటీ జట్టు మధ్య జరిగిన మ్యాచులో ఈ వింత చోటుచేసుకుంది. ఇండోర్ మైదానంలో జరిగిన ఈ మ్యాచులో బాప్‌చైల్డ్ జట్టు కనీసం ఒక్క పరుగు కూడా చేయకుండా ఆలౌటైంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ న్యూస్ హల్ చల్ చేస్తుంది.

ట్విట్స్ : 

మరింత సమాచారం తెలుసుకోండి: