రియో ఒలంపిక్స్ లో కేవలం ఇండియా రెండు పతాకాలనే గెలిచింది అయినా సరే ఆ పతకాలను అందుకున్న వారికి విజయ యాత్రలతో అంగరంగ వైభవంగా స్వాగతం పలికారు. అయితే 125 కోట్ల జనాభా గల దేశంలో కేవలం రెండు పతకాలే సాదించినందుకు సంబరాలు ఎందుకు జరుపుకుంటున్నారని బ్రిటీష్ జర్నలిస్ట్ పియర్స్ మోర్గాన్ వ్యాఖ్యానించాడు. 


ఇక దానికి ఒళ్లు మండిన సెహ్వాగ్ భారతీయులు ప్రతి చిన్న విషాయానికి ఆందంగా సంబరాలు జరుపుకుంటారని అన్నాడు. ఇక అదే క్రమంలో క్రికెట్ కనిపెట్టింది తామే అని చెప్పుకునే ఇంగ్లాండ్ ఇంతవరకు వరల్డ్ కప్ కొట్టలేదు అయినా సరే వరల్డ్ కప్ లో ఇప్పటికి ఆ జట్టు ఆడటం ఏమంత ఇబ్బందికరం లేదని ట్వీట్ చేశాడు.


అయితే సెహ్వాగ్ వేసిన ట్వీట్ కు స్పందించిన మోర్గాన్ పీటర్సన్ ఆడి ఉంటే ఇంగ్లాండ్ కు ఎప్పుడో వరల్డ్ కప్ వచ్చేదని చాలా వ్యగంగా తనకు క్రికెట్ గురించి చెబితే ఎలా అన్నట్టు ట్వీట్ చేశాడు. ఇక దానికి కూడా వీరేంద్ర సెహ్వాగ్ గట్టిగానే రిప్లై ఇచ్చాడు. పీటర్సన్ ఇంగ్లాండ్ వ్యక్తి కాదని సౌతాఫ్రికాలో పుట్టాడని.. అయినా 2007 వరక్డ్ కప్ లో పీటర్సన్ కూడా ఆడాడని అయినా ఇంగ్లాండ్ కప్ గెలవలేదని రిప్లై ఇచ్చాడు. సెహ్వాగ్ తో పెట్టుకునే సత్తా లేక అంతటితో ఆగిపోయాడు మోర్గాన్. 



మరింత సమాచారం తెలుసుకోండి: